February 26, 2013

మహాధర్నాతో సర్కారును కదిలిద్దాం: బాబు

ఇంటికొకరొస్తే నీళ్లిప్పిస్తా!

కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ఆరుతడి పంటలకు సాగునీరు ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని తెలుగుదేశం పా ర్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. డెల్టా పరిధిలో ఇంటికొకరు తన వెంట వస్తే, గుంటూరు కలెక్టరేట్ ఎదు ట మహాధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. "ముందు రై తులకు నీరు విడుదల చేయండి. మొక్కజొన్న, మిను ము, పెసర పంటలను కాపాడండి. ఆ తర్వాత నాపై కేసులు పెట్టుకోండి'' అని ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం విశ్వేశ్వరపురంవద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మోర్తో ట, మైనేనివారిపాలెం, నల్లూరు, రుద్రవరం మీదుగా పెనుమూడి-పులిగడ్డ వారధి వరకు 13.5 కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో సాగునీరు లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆయన వద్ద వాపోయారు. "డెల్టాకు సాగునీరు విడుదల చేయాల్సిందిగా పదేపదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాను. సీఎంకు అనేక లేఖలు రాసినా కదలిక లేదు'' అని చంద్రబాబు మండిపడ్డారు.

పోలీసులు, రెవెన్యూ, ఎమ్మెల్యేలను కాలువలపై పెట్టి చివరి భూములకు కూడా సాగర్ నీళ్లిచ్చిన ఘనత తమదని గుర్తుచేశారు. అనంతరం తనను కలిసిన కల్లుగీత కార్మికుల వెతలు ఆలకించారు. "పట్టణ ప్రాంతాల్లో చుట్టూ 60 కిలోమీటర్ల వరకు కల్లు విక్రయించరాదన్న జీవో దుర్మార్గం. గీత కార్మికుల కడుపు కొట్టారు'' అని మండిపడ్డారు.

జిల్లాలో నేటితో యాత్ర ముగింపు: గుంటూరు జిల్లా లో బుధవారం మధ్యాహ్నం పాదయాత్ర ముగియనుం ది. ఈనెల 6న విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఆయన గుంటూరులో ప్రవేశించారు.