March 26, 2013

టీడీపీ హయాంలోనే అన్నివర్గాలకు న్యాయం

మండపేట: జిల్లాలో తాను చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను ఆదరించిన రాజమండ్రి సిటీ, రూరల్ ని యోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. మీకోసం వస్తు న్నా పాదయాత్రలో భాగంగా ఏడిద లో బస చేసిన చంద్రబాబు రాజమం డ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఒక కుటుంబమని, ఇక్కడ కష్టపడేవారికి గుర్తింపు తప్పనిసరిగా వస్తుందని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణమని అన్నారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అవినీతిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.

పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ట పరిచి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కో రారు. ప్రస్తుతం కరెంటు, విద్య, తాగునీరు లభించకపోగా, ధరలు విపరీతం గా పెరిగిపోయి నష్టపోతున్నామని ఓ గీత కార్మికుడు చెప్పడం తనకు ఆవేదనను కలిగించిందన్నారు. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిని ప్రజలకు వివరించాలని ఆ భాధ్యత మనందరిపై ఉందని కొంతమంది చేసిన సూచనను బాబు అంగీకరించారు.

తమ హయాంలో రౌడీయిజం, కుల,మత ఘర్షణలకు తావులేకుండా పాల న అందించామని చెప్పారు. అభ్యర్థుల ఎన్నికలో రహస్య ఎస్ఎంఎస్‌ల పద్దది పాటించాలని ఓ యువకుడు బాబుకు సూచించారు. దీనిపై బాబు మాట్లాడుతూ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని యువతకు, మంచివారికి అవకాశం ఇస్తామన్నారు. టీడీపీ జిల్లా సమావేశాలు నియోజకవర్గ స మావేశాలు మండలాలోను, మండల సమావేశాలు గ్రామాల్లోను నిర్వహిస్తే పార్టీని పటిష్ట పరిచేందుకు వీలు కలుగుతుందని పలువురు సూచించారు. ఎస్సీలకు టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యతను బాబు గుర్తు చేశారు. మాలలకు వర్గీకరణ ద్వారా అన్యాయం జరగదని చె ప్పారు.

ముస్లింలకు సీటుల శాతం పెంచాలని యువతకు పెద్దపీట వేయాలని, విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలని పలువురు సూచించారు. స్థానికంగా ఏర్పాటు చేసే పరి శ్రమల్లో ఉద్యోగావకాశాలు స్థానికులకే కల్పించాలని పలువురు కోరగా, వాటిని పరిశీలిస్తున్నామని బాబు హామీ ఇచ్చారు. సమావేశంలో రెండు నియోజకవర్గాల కార్యకర్తలు విక్టరీ చిహ్నం చూపాలంటూ చేసిన విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు. సమావేశంలో రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత చిట్టిబా బు, స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, నాయకులు గన్ని కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.