April 24, 2013

దర్శిలో అభివృద్ధి దయనీయం

  ఒంగోలు:'దర్శి నియోజకవర్గంలో తిష్టవేసిన ప్రజా సమస్యలను పరిశీలిస్తే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్న విషయం తేటతెల్లమవు తుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలపై అవ గాహన ఉన్న నాకు దర్శి ప్రాంత ప్రజల సమస్యలు చూసిన తర్వాత ఇక్కడ ఎంతటి దయనీయ పరిస్థితి ఉందో అర్థమైంది. నియోజకవర్గ పొలిమేర నుంచే సాగర్

కాలువ ఉన్నా తాగునీటి సమస్య తాండవించడం అందుకు నిదర్శనం. దీనంతటికీ గత పదేళ్లుగా అధికారంలో ఉన్న వారే బాధ్యత వహించాలి. రాష్ట్రం లో తెదేపా పాలనలో జన్మభూమి పథ కంతో అనేక ప్రాంతాల్లోని గ్రామ సీమ లు సిమెంట్ రోడ్లతో కళకళలాడాయి. కానీ నేటికీ ఇక్కడ గ్రామాల్లో సక్ర మంగా రోడ్లు లేని దుస్థితి నెలకొంది.

అందుకే నియోజకవర్గంలో ఏ ప్రాంతా నికి వెళ్లినా ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. నా పట్ల అపారమైన ఆద రాభిమానాలు చూపిస్తూనే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదిస్తున్నా రు. అందుకే వచ్చే ఎన్నికల్లో నన్ను ఆద రిస్తే ప్రభుత్వ నిధులు ఆశించిన స్థాయి లో అందకపోయినా సొంత డబ్బులు వెచ్చించి మంచినీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం కల్పించడం జరుగుతుందని హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టినా, బోర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నా అదం తా ప్రజల ఇబ్బందులను పరిష్కరించ డమే తప్ప ఎన్నికల్లో లబ్ధికోసం కాదు.

ఎప్పుడో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డబ్బు వెదజల్లే మనస్తత్వం నాది కాదు. అదే సమయంలో ప్రజల అవసరాల కోసం సొంత నిధులను వెచ్చించేందుకు రాజకీయాలకు అతీతం గా వ్యవహరిస్తాను. అందుకు గతంలో చీమకుర్తితోపాటు, అనేక ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలే దర్పణం పడతా యి'. ఇదీ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యు డు, దర్శి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి శిద్దా రాఘవరావు వ్యక్తం చేసిన అభిప్రా యాలు.

గత కొంతకాలంగా నియోజక వర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న శిద్దా ప్రస్తుతం దర్శిలో వీధివీధినా పర్యటి స్తున్నారు. ఆ సందర్భంగా సోమవారం సాయంత్రం పాదయాత్రలో కలిసిన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో పలు అంశాల పై తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు. అందులోని ము ఖ్యాం శాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పాద యాత్ర చేపట్టారా?

నేను పాదయాత్ర ఈ రోజు చేపట్ట లేదు. ఇప్పటికే దొనకొండ, ముండ్లమూ రు మండలాల్లోని గ్రామాల్లో పర్యటిం చాను. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్ర మైన దర్శిలో పాదయాత్ర చేస్తున్నా.

ఎన్నికల లక్ష్యం కాకుంటే పాదయాత్ర ఉద్దేశం ఏమిటి?


ప్రజల జీవన విధానాన్ని, వారి ఆర్థిక, సమాజిక స్థితిగతులను, నియోజకవ ర్గంలో నెలకొన్న సమస్యలను అధ్యయ నం చేసేందుకే చేపట్టా.

ఇప్పటి వరకు మీరు ఏం గుర్తించారు?
అభివృద్ధిలో నియోజకవర్గ పరిస్థితి దయనీయంగా ఉందనేది మాత్రం ని జం. అందుకు వాడవాడలా ప్రజలు చె ప్పే సమస్యలే దర్పణం పడుతున్నాయి.

ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి?

స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా గుక్కెడు మంచినీటి కోసం ఇక్కడి ప్రజ లు పరితపిస్తున్నారు. మరోవైపు రవాణా సౌకర్యాల విషయంలోనూ నియోజక వర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. గ్రామా ల్లోనే కాదు, మండల కేంద్రాలు, నియో జకవర్గ కేంద్రంలో కూడా సరైన రోడ్ల ఏర్పాటు జరగలేదు.

ఇవి మీరు చెప్పే సమస్యలా? ప్రజలు చెప్పినవా?


ఎక్కడికెళ్లినా ప్రజలు ఈ రెండు సమ స్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో నియోజకవర్గంలోని ఏ ఒక్కప్రాంతం మినహాయింపు కాదు.

అందుకు కారణం ఏమిటనే విష యాన్ని గుర్తించారా?

గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలకులే అందుకు కారణమని కచ్ఛితం గా చెప్పగలను. తెదేపా హయాంలో జన్మభూమి కార్యక్రమం చేపట్టిన రోజు ల్లో కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిధి ఉన్నారు. అందువలన అప్పుడు చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పూర్తిగా అమలుకు నోచుకోలేదు. ఇక గత రెండు పర్యాయాలుగా ప్రభుత్వ పథకాలను అటుంచితే, స్థానికంగా అధికారంలో ఉన్న వారు మాటలతో ప్రజలను మోసం చేయడం మినహా అభివృద్ధి పనులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు.

ఇది మీ అభిప్రాయమా? ప్రజలు చెప్తున్నారా?

ఇద్దరి అభిప్రాయం. నేను చేసిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్ల మైంది. అలాగే నా పాదయాత్రలో కలు స్తున్న ప్రజల నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరి మీరేమి హామీ ఇస్తున్నారు?

నన్ను ఆదరించి గెలిపిస్తే ఈ సమస్య లను కచ్ఛితంగా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను.

స్థానికంగా మీరు గెలిచి రాష్ట్రంలో మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా మీరు చెప్పిన స్థాయి అభివృద్ధి సాధ్యమేనా?

నాకున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రాబడతా. కాదూ కూడదంటే ఓ పదోపాతిక కోట్ల రూపాయలో సొంత నిధులు వెచ్చించి అయినా సమస్యలు పరిష్కరిస్తా. ఆవిషయంలో రాజీ పడేది లేదు.

ఆ సందర్భంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?


నా హామీలకు అతీతంగానే ప్రజలు తెదేపాను, నన్ను ఆదరిస్తున్నారు. అందు కు తరతమ భేదం లేకుండా అన్ని ప్రాం తాల్లో చిన్నారుల నుంచి, వృద్ధుల వరకు రోడ్డుపైకి వచ్చి నాకు స్వాగతం పలుకు తుండటం, నేను నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేయడం నిదర్శనం. చాలా ప్రాంతాల్లో మహిళలు, పెద్దలు నన్ను 'మీ సేవా భావం నచ్చింది. రాజకీయా లకు అతీతంగా మిమ్మల్ని ఆదిరిస్తాం' అంటూ ఆశీర్వదిస్తుండటం నాలో మనో ధైర్యాన్ని పెంచింది.

అలాంటి ఆదరణ ప్రజల్లో ఉంటే ప్రస్తుతం ఉచిత సేవా కార్యక్రమాలను ఎందుకు చేపట్టారు?

నేను చేపట్టిన కార్యక్రమం ఏమిటో? మీకు ఎందుకు అనుమానాలు వచ్చా యో చెప్పగలరా?

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, బోర్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేయ డం లేదా?

ఈ కార్యక్రమాల నిర్వహణకు, రాజకీ యాలకు ఎలాంటి సంబంధం లేదు. నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడటాన్ని గుర్తించాను. ఇప్పటికే ఎండలు మండుతుండటం, భూగర్భజల మట్టం తగ్గడంతో తక్షణ సమస్య పరిష్కారంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా. ఉన్నంతలో మరింతకాలం సమస్య పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో బోర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా.

ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ పనులు చేయించాలి కదా?


ప్రజా సమస్యలను గుర్తిస్తేనో, ప్రతి పక్షాలు ఒత్తిడి చేస్తేనో గమనించి చర్య లు తీసుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభు త్వం ఉందంటే మీరు నమ్ముతున్నారా? సాగర్ కాలువల ద్వారా మంచినీటి చెరువులకు నీరందించాలన్న విషయం కూడా మా పార్టీ ఆందోళన చేస్తేనే పాలకపక్షానికి గుర్తొచ్చింది. వచ్చిన నీటిని సక్రమంగా చెరువులను నింపలేక పోయారన్న విషయం కూడా మేము చెబితే కాని అధికార యంత్రాంగానికి తెలియలేదు.

ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారానికి చర్యలు పూర్తిస్థాయిలో తీసుకోకుండా కంటితుడుపు నిర్ణయాల తో ముందుకు సాగుతున్నారు. అందు వలన దర్శి ప్రజల మేలు కోరే నేతగా సొంత నిధులు వెచ్చించి ముందుకు వారి దాహార్తిని తీరుస్తున్నా.

నిజంగా ప్రజల కోసమే అయితే గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్ర మాలు చేసి ఉండాలి కదా?

ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయ డంలో నేను కానీ, మా కుటుంబం కానీ ఎప్పుడూ ముందే ఉంటుంది.

చీమకుర్తి ప్రాంతంలో చేపట్టిన కార్యక్రమాలే అం దుకు నిదర్శనం. రాజకీయ లబ్ధిని కోరే వాళ్లం అయితే దళితులకు రిజర్వు అయి న సంతనూతలపాడు నియోజకవర్గం లోని చీమకుర్తి ప్రాంతంలో అలాంటి కార్యక్రమాలు చేసి ఉండేవాళ్లం కాదు. అంతకు మించి నా సేవా తత్పరతపై ఎక్కువ వివరణ ఇచ్చుకోవాల్సిన అవస రం లేదని భావిస్తున్నా.