April 13, 2013

చీకట్ల పాపం కాంగ్రెస్‌దే

గుజరాతీపేట: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. తీవ్రతరమైన విద్యుత్ కోతలపై ఆ పార్టీ నిరసన జోరు కొనసాగిస్తోంది. విద్యుత్ కోతలపై ప్రజల నుంచి సంతకాల సేకరణలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం బలగమెట్టు ప్రాంతంలో టీడీపీ నేతలు లాంతర్లు, కొవ్వొత్తులతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. చీకట్లోనే జనం నుంచి సంతకాలను సేకరించారు. విద్యుత్ కోతలతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని, కోతలు ఎత్తివేసేవరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందన్నారు.

పెంచిన విద్యుత్ చార్జీలు, కరెంట్‌కోతకు నిరసనగా శుక్రవారం స్థానిక బలగమెట్టు ప్రాంతంలో టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. దీనిలో భా గంగా క్యాండెల్ ర్యాలీ, సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా మాజీమం త్రి గుండ అప్పలసూర్యనారాయణ, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలన లో విద్యుత్ చార్జీలే కాకుండా నిరంతరంగా కరెంట్ కోతలు ఎక్కువయ్యాయన్నా రు. అధికార పార్టీ గద్దె దించేందుకు ఇంకా కొద్దిరోజులే గడువు ఉందన్నారు. టీడీ పీ హయాంలో పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

సమావేశంలో స్వల్ప వాగ్వాదం సమావేశంలో గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎక్స్ కౌన్సిలర్ రెడ్డి మోహన్ ఆవేశంగా స్టేజ్‌వద్దకు వచ్చి తనకు మైకు ఇ వ్వాలని గుండ అప్పలసూర్యనారాయణతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ ఏపార్టీ హయాంలో అభివృద్ది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మంత్రి ధర్మానను తీసుకొని రావాలని ఆయన గంభీరంగా మాట్లాడారు. ఈ సమావేశంలో దేశం పార్టీ నేతలు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణ్, బుక్కా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.