April 13, 2013

చంద్రబాబుకు ఎక్కువైన కండరాల నొప్పి వైద్య నిపుణుల పరీక్షలు.

రెండు రోజుల విరామం
రేపటి నుంచి పాదయాత్ర పునఃప్రారంభం
బాబును చూసేందుకు వచ్చిన భువనేశ్వరి
బాబు వెన్నంటి అయ్యన్న, దాడి తనయులు

విశాఖపట్నం, నర్సీపట్నం : కండరాల నొప్పి తీవ్రంగా ఉన్నా.. పంటిబిగువున భరించి తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన చంద్రబాబు.. వైద్యుల సలహా మేరకు పాదయాత్రకు రెండు రోజుల విరామం ఇచ్చారు. విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం సమీపంలోని కొబ్బరితోటలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సలహా మేరకు సోమవారం సాయంత్రం వరకు చంద్రబాబు విశ్రాంతి కొనసాగుతుందని టీడీపీ నాయకులు గరికిపాటి మోహనరావు, అయ్యన్నపాత్రుడు తెలిపారు.

సోమవారం సాయంత్రం చంద్రబాబు శృంగవరం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించి అదే మండలంలోని డి.ఎర్రవరంలో రాత్రి బసచేస్తారు. చంద్రబాబును చూసేందుకు ఆయన భార్య భువనేశ్వరి శనివారం మధ్యాహ్నం శృంగవరం గ్రామానికి విచ్చేశారు. అంతకుముందు చంద్రబాబుకు విజయవాడకు చెందిన ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కనీసం రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దాంతో నాయకులెవ్వరినీ కలవకుండా చంద్రబాబు తన ప్రత్యేక వాహనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చంద్రబాబును కలిసేందుకు వచ్చినా ఆమెకు అనుమతి లభించలేదు. అయ్యన్నపాత్రుడు, మోహనరావు మాత్రమే చంద్రబాబుతో కొద్ది నిమిషాలు మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం చంద్రబాబు బసచేసిన శిబిరం వద్ద ఏర్పాటుచేయనున్న కార్యక్రమంలో అంబేద్కర్‌కు చంద్రబాబు నివాళి అర్పించనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గ సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

యువతకు పెద్దపీట
చంద్రబాబు తన పాదయాత్రలో యువనేతలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. సీనియర్ నేతల కుమారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్న మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, అయ్యన్నపాత్రుడు కుమారులు రత్నాకర్, విజయ్‌బాబు ఇద్దరూ పాదయాత్ర తొలిరోజున చంద్రబాబుకు కుడిఎడమల నడిచి, ప్రధానాకర్షణగా నిలిచారు.

వీరభద్రరావు తనయుడు రత్నాకర్‌కు ఇటీవలే రూరల్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించగా, అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌బాబుకు త్వరలో తెలుగుయువత రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు సైతం వాళ్లు చెప్పిన విషయాలు వింటూ.. బహిరంగసభల్లో వేదికపైకి ఆహ్వానిస్తూ తగు ప్రాధాన్యం కల్పించారు. వీరి బాటలోనే మరికొందరు నాయకుల వార

పైలాన్ స్థలం కోసం అన్వేషణ
పాదయాత్ర ముగింపు సందర్భంగా చంద్రబాబు ఆవిష్కరించే పైలాన్ నిర్మాణానికి మరో స్థలం కోసం టీడీపీ నేతలు అన్వేషణ ప్రారంభించారు. పైలాన్ కోసం గాజువాక సమీపంలోని వడ్లపూడిలో స్థలం కొనుగోలు చేసి భూమిపూజ కూడా చేశారు. అయితే అది ఇప్పుడు వివాదంలో పడింది. ఆ స్థలం విశాఖ స్టీల్‌ప్లాంటుకు చెందినదని, అందులో నిర్మాణాలు చేపట్టొద్దని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. దీంతో మరో స్థలం కోసం నేతలు అన్వేషిస్తున్నారు.

ఈనెల 27న చంద్రబాబు పైలాన్‌ను ఆవిష్కరించాలి. అంటే మరో 13 రోజుల సమయమే వుంది. అప్పటిలోగా పైలాన్ నిర్మాణం పూర్తవుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే స్థలం ఎంపిక, నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే శనివారం యనమల రామకృష్ణుడు, మోహనరావు తదితరులు కూర్మన్నపాలెంలో ఒకటి, టోల్‌గేటు వద్ద రెండు స్థలాలను పరిశీలించారు.

ఆదివారానికి స్థల ఎంపిక పూర్తికావచ్చునని పార్టీ నేత ఒకరు తెలిపారు. పైలాన్ నిర్మించాలని గత నెలలోనే నిర్ణయించినా ఏర్పాట్లు మాత్రం అందుకు తగినట్లు జరగలేదు. జిల్లా, నగర నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్థలం ఎంపికలో హడావుడి చేశారు తప్ప సీనియర్ల సలహాలను తీసుకోవడం విస్మరించారు. నాయకులు కలిసికట్టుగా వ్యవహరించలేదు. వడ్లపూడిలో ఎంపికచేసిన స్థలం ప్రభుత్వానిదంటూ కొందరు పార్టీ నాయకులే అధికారులకు ఫిర్యాదు చేశారు.
సులు కూడా రాజకీయ ప్రవేశం చేసే అవకాశం కనిపిస్తోంది.