January 10, 2013

కూసుమంచిలో బాబు పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తి



కూసుమంచిలో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు నుంచి చంద్రబాబు గురువారం ఉదయం కూసుమంచి మండలం పెద్దపోచారంలోకి అడుగుపెడతారు. అక్కడినుంచి చిన్నపోచారం, కిష్టాపురం, తురకగూడెం క్రాస్‌రోడ్డు నుంచి కూసుమంచికి చేరతారు. గురువారం రాత్రి కూసుమంచిలో బహిరంగసభలో పాల్గొని ఇక్కడే బసచేస్తారు. ఇందుకు సంబంధంచి రాష్ట్రపరిశీలకులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తలు ఊరూరా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కూసుమంచి హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభకు ఏర్పాటు చేశారు.