November 10, 2012

కేసీఆర్ పూటకో మాట మాట్లాడేది నువ్వే,ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకం లేం



కేసీఆర్.. ఒళ్లు జాగ్రత్త!
మా పార్టీ చచ్చిపోయిందంటావా?
పూటకో మాట మాట్లాడేది నువ్వే
ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకం లేం
కోదండకు చెప్పి జేఏసీ నుంచి మమ్మల్ని తరిమేశావు
కాంగ్రెస్ మోసకారి అని ఇన్నాళ్లకు తెలిసిందా?
టీఆర్ఎస్ అధినేతపై టీడీపీ నిప్పలు

కరీంనగర్ వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 'తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింద''న్న గులాబీ అధినేత ప్రకటనపై టీడీపీ ఘాటుగా స్పందించింది. "ఒళ్లు దగ్గర పెట్టుకో''మని గట్టిగా హెచ్చరించింది. " వంద అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలిస్తే తెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలని'' వైసీపీ నిలదీయగా, "ఢిల్లీలో నీతో ఎవరు మాట్లాడారో చెప్పు'' అని కాంగ్రెస్ తీవ్రస్వరంతో ప్రశ్నించింది. 'ఉన్న మాటంటే ఉలుకెందుకు'' అంటూ టీఆర్ఎస్ సైతం ఎదురుదాడికి పదును పెడుతోంది.

గత ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తుపెట్టుకొని తెర వెనక కాంగ్రెస్‌ను గెలిపించిన ఘనుడు కేసీఆర్ అని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు దుయ్యబట్టారు. కేసీఆర్‌కు దమ్ముంటే బస్సు యాత్ర కాక, తమ అధినేతలా పాదయాత్రకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని టీడీపీకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టంగా ఉందని, ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కేసీఆర్ మాట్లాడాలని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ హెచ్చరించారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కై బ్లాక్‌మొయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రస్తుతం తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీ నామా నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే టీడీపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు జ్ఞానోదయమైనట్టుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ ఒత్తిడి వల్లే జేఏసీ నుంచి తమను అకారణంగా జేఎసీ నుంచి బహిష్కరించిందని ధ్వజమెత్తారు. తన అజ్ఞానానికి, ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసినందుకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ డిమాండ్ చేశారు.

4 comments :

4 comments :

Anonymous said...

KCR సంగతి మీరు చెప్పినట్టే అనుకుందాం. మరి మీ నాయకుని చేత 'తెలంగాణాకు అనుకూలం' అని చెప్పించగల దమ్ము మీకుందా? అది చెప్పనంత వరకు మీకు తెలంగాణాలో ఒక్క సీటు కూడా రాదు.

Anonymous said...

'వ్యతిరేకంగా లేం', 'అనుకూలంగా వున్నాం' రెండూ ఒక్కటి కావు. తెలంగాణా వారికి కావలసింది 'వ్యతిరేకంగా లేం' అన్న మాట కాదు, 'అనుకూలంగా వున్నాం' అనే మాట. అది చెప్పనంత వరకు మీరు చేసే మోసాలను వారు గమనిస్తూనే వుంటారు.

Anonymous said...

****** తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టంగా ఉందని,
ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు ******

ఇలాంటి పచ్చి అబద్ధాలే టీ డీ పీ కి తెలంగాణా ప్రజల్లో వున్న సింపతీని పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నాయి.
ఏం స్పష్టం మీ బొంద స్పష్టం.
అటున్నోల్లు సమైక్యాంధ్ర అనడం ...
రాజకుమారి వెళ్లి జగడపాటిని కిస్సింగ్ చేయడం....
ఇటున్నోల్లు మింగలేక కక్కలేక జై తెలంగాణా అనడం స్పష్టతా?
బాబు రెండుకళ్ళ సిద్ధాంతం స్పష్టతా??
ప్రనబ్ముకర్జీ కమిటీకి తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాత
అఖిలపక్ష సమావేశంలో సగం టీడీపీ సమైక్య వాదనలు చేయడం,
సగం టీడీపీ తెలంగాణా పాట పాడటం స్పష్టతా ??
పైనుంచి మేం ఆ లేఖ వాపస్ తీసుకోలేదని బుకాయింపోకటి
ప్రజలు మీలెక్కనే హౌల గాళ్ళను కుంటున్నారా??
స్పష్టత అంటే డిసెంబర్ ౯ ప్రకటనకు కట్టుబడి తెలంగాణాను ఏర్పాటు చేయాలని
ఒకే కాంతం తో టీ డీ పీ కాంగ్రెస్ ను నిలదీయాలి.
లేకుంటే మేం సమైక్యతకే కట్టుబడి ఉన్నామని ఒకే మాట చెప్పాలి
ఇంకా ఎన్నాళ్ళు ఈ నాటకాలు.
ఎవరు నమ్ముతున్నారు మీ దగాకోరు మాటల్ని
ఎందుకీ ఆత్మవంచన ?!

Ramesh, Hyderabad


Anonymous said...

అసలు చంద్రబాబు నాయుడు తెలంగాణా పై స్పష్టత ఇచ్చేందు కోసం ప్రధాన మంత్రికి రాసినట్టు చెప్తున్నా లేఖను పోస్ట్ చేసారా లేదా అనే సందేహం కలుగుతోంది.
కేంద్ర హోమ్ మంత్రి షిండే ఆ లేఖ రాలేదంటున్నారు . అఖిల పక్షం ఏర్పాటు చేయాల్సింది ఆయనే కదా. మరి చంద్ర బాబు లేఖ ఎక్కడికి పోయినట్టు? రాసి రెండు నెల లైతున్నా
చంద్ర బాబు ఎందుకు ఫాలో అప్ చేయలేదు? ఎందుకు ఒక రిమైండర్ రాయలేదు?? ఎందుకు తెలంగాణా ఏమ్పీలనైనా కనుక్కొమ్మని పురమాయించలేదు.?? లేఖరాసిన అని చెప్పి దులిపెసుకుంటే
అయిపోయిందా???. తెలంగాణా సమస్య అంత మామూలు సమస్యనా??? ఈ విషయం పై చంద్ర బాబు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ