November 10, 2012

చంద్రబాబు నాయుడు గిరిజన డిక్లరేషన్ ,టీడీపీ అధికారంలోకి వస్తే గిరిజన యూనివర్సిటీ



ప్రతి గిరిజన కుటుంబానికి ఇల్లు, 2 ఎకరాల భూమి
రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
గ్రామపంచాయీతీలుగా 500 జనాభాగల తండాలు
టీడీపీ అధికారంలోకి వస్తే గిరిజన యూనివర్సిటీ
ఇది చంద్రబాబు నాయుడు గిరిజన డిక్లరేషన్
ఇప్పటికే బీసీ, మైనారిటీల డిక్లరేషన్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు టీడీపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు కోసం చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి డిక్లరేషన్‌ను శనివారం సాయంత్రం ప్రకటించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 11 ఐటీడీఏలను ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యంచేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు ఓటు బ్యాంకుగా మార్చుకుందని ఆయన విమర్శించారు.

ఇవి గిరిజన డిక్లరేషన్ విధానాలు...


* ఇళ్లులేని గిరిజనులకు రూ.1.50లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణం.
* భూమి లేని గిరిజనులకు రెండెకరాలు భూమి
* 500 జనాభా ఉన్న తండాలు ప్రత్యేక గ్రామ పంచాయీతీలుగా చేయడం
* జిల్లా యూనిట్‌గా తీసుకొని గిరిజన జనాభా ప్రకారం రిజర్వేషన్లు
* రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు.
* ప్రత్యేక గిరిజన యూనివర్సిటీ, ఎస్టీ కమీషన్ ఏర్పాటు
* ప్రతి జిల్లాలో మైదాన ప్రాంతాల్లో ప్రత్యేక ఐటీడీఎలు
* 50ఏళ్లు దాటిన గిరిజనులకు పింఛన్ సౌకర్యం
* డయేరియా, మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధులకు ఆరోగ్య బీమా ద్వారా వైద్య సదుపాయం.
* కేజీ నుంచి పీజీ వరకు గిరిజన పిల్లలకు ఉచిత విద్య
* గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ
* తండాల్లో మౌలిక సదుపాయాలు
* ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ
* గిరిజన అమ్మాయి పెళ్లికి రూ.50వేల ఆర్థిక సహాయం
* జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టులు భర్తీలో గిరిజనులకు ప్రాధాన్యాం
* ప్రతి జిల్లాలో గిరిజన్ భవన్, గిరిజన యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు.
* గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు, సంస్కతి సంప్రదాయాల పరిరక్షణకు పూజారులకు రూ.5 వేలు
* గిరిజన ఉప ప్రణాళిక నిధులకు చట్టబద్దత కల్పించి అభివద్ధి పరచడం.
* ఐటీడీఏ, ఇతర శాఖల లో కాంట్రాక్ట్ పద్దతిని పని చేస్తున్న గిరిజనులకు రెగ్యూలరైజేషన్.
* గిరిజన ప్రాంతాల్లో ప్రకతి సంపదపై వారికే హక్కు కల్పించడం
* ప్రతి యూనివర్సిటీ, ఇతర సంస్థల పాలక మండలిలో ఎస్టీలకు ప్రా
«థినిత్యం
* గిరిజనులకు వ్యవసాయ సౌకర్యం నిమిత్తం ఇరిగేషన్ సదుపాయాలు కల్పించడం

2 comments :

2 comments :

Anonymous said...

అలాగే
తెలంగాణా డిక్లరేషన్ ఎందుకు చేయరు ?
అఖిలపక్షం ఏర్పాటు చేస్తే కేంద్రం చెవిలో చెప్తామని నాటకాలు ఎందుకు.
గిరిజన డిక్లరేషన్ లాగా స్పష్టంగా తెలంగాణా డిక్లరేషన్ చేస్తే
తెలంగాణా ప్రజలు జేజేలు పలుకుతారు కదా.
ఇంకా ఎంతకాలం ఈ ముసుగులో గుద్దులాట.

Anonymous said...

అసలు చంద్రబాబు నాయుడు తెలంగాణా పై స్పష్టత ఇచ్చేందు కోసం ప్రధాన మంత్రికి రాసినట్టు చెప్తున్నా లేఖను పోస్ట్ చేసారా లేదా అనే సందేహం కలుగుతోంది.
కేంద్ర హోమ్ మంత్రి షిండే ఆ లేఖ రాలేదంటున్నారు . అఖిల పక్షం ఏర్పాటు చేయాల్సింది ఆయనే కదా. మరి చంద్ర బాబు లేఖ ఎక్కడికి పోయినట్టు? రాసి రెండు నెల లైతున్నా
చంద్ర బాబు ఎందుకు ఫాలో అప్ చేయలేదు? ఎందుకు ఒక రిమైండర్ రాయలేదు?? ఎందుకు తెలంగాణా ఏమ్పీలనైనా కనుక్కొమ్మని పురమాయించలేదు.?? లేఖరాసిన అని చెప్పి దులిపెసుకుంటే
అయిపోయిందా???. తెలంగాణా సమస్య అంత మామూలు సమస్యనా??? ఈ విషయం పై చంద్ర బాబు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ