July 2, 2013

ఖమ్మం నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం తుమ్మల నిరాహార దీక్ష

ఖమ్మం నగరంలో పేదలకు ఇళ్లస్థలాల సాధనకోసం మాజీమంత్రి,ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరావు సోమవారం నిరవధిక నిరహర దీక్ష చేపట్టారు. ఖమ్మం కలెక్టర్‌ కార్యాయం వద్ద చేపట్టిన దీక్షకు సిపిఐ సంఘీబావం ప్రకటించింది. జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, ఇతర నాయకులు పెద్ద ఎత్తున తుమ్మలకు మద్దతు ప్రకటించారు. ఖమ్మంలో నివసించే 9 వేల మంది పేదలు తమకు ఇళ్ల స్థలాలు కావాలని దరఖాస్తులు పెట్టుకుంటే వారీలో 7వేల మందికి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకుండా చేతులు దులుపుకున్నారని తుమ్మల విమర్శించారు. దీక్ష శిభిరం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయంలో అధికారుల తీరు గర్హనీయమన్నారు. తెలంగాణ జిల్లాలలో ఖమ్మం నగరం అన్ని రకాలుగా విస్తరించింది.

ముఖ్యంగా పేదలు నగరం బాట పట్టడంతో వారికి కనీసం ఉండేందుకు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని దుయ్యబట్టారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇవ్వలేదని అన్నారు. అనేక జిల్లాలకు మంచి నీటి పథకాలు మంజూరైనప్పటికి ఖమ్మం జిల్లాకు కాలేదని ఆరోపించారు. మంచి నీళ్లు , ఇళ్ల స్థలాలు ఇవ్వక పోగా అడ్డుపడుతున్నారని ఇదే వైఖరి కొనసాగితే కాంగ్రెస్‌కు పుట్టగతలు ఉండవని ఆయన హెచ్చరించారు. ఖమ్మంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం ముఖ్యమంత్రుల వద్ద, మంత్రుల వద్ద, ఇన్‌చార్జీ మంత్రుల వద్ద జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టర్‌ వద్ద, జాయింట్‌ కలెక్టర్‌ వద్ద మొత్తుకున్నానని ,కార్యాలయాల చూట్టు అనేక మార్లు తిరిగి బ్రతిమి లాడను, ప్రాదేయపడ్డాను ఇది నాకోసం కాదు పేదలకు న్యాయం చేయమని అడిగాను ఆయనప్పటకి ఎవరు నుంచి సరైన స్సందన రాలేదని మండి పడ్డారు.

ముఖ్యమంత్ర కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరమ్మ బాటకు వచ్చిన సందర్బంగా తాము నిరసన తెలుపుతామంటే ముఖ్యమంత్రే స్వయంగా లక్ష్మారెడ్డి అనే ఎమ్మెల్యేని తమ వద్దకు పంపించి ఖమ్మంలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తామని హామి ఇచ్చారని ఆహామి మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఆదేశాలు జారీచేసినా ఇక్కడ అధికారులు స్పందిం చటం లేదని ద్వజమెత్తారు. తమ వత్తిడి మేరకు 6 వేల మంది లబ్ది దారులకు 2007 లోనే పట్టాలు పం పించారు. కాని స్థలాలు చూపించ లేదని ఇదేక్కడ న్యాయం మని జిల్లా అధికారులను నిలదీశారు. అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య దక్కర 3 మీటింగ్‌లు జరిగాయి. ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి ఇళ్లస్థలాలు వెంటనే ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. ప్లాటింగ్‌ జరిగింది. లబ్దిదారులను గుర్తించారు. ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చి స్థలం గురించి ఇవ్వకుండా కొన్ని శక్తులు అడ్డుతగులు తున్నాయని అన్నారు. పేదలకు న్యాయం జరిగే తన దీక్ష ఆగదని ఆయన స్పష్టంచేశారు.

జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొండబాల కోటేశ్వర రావు మాట్లాడుతూ ఖమ్మంలో పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఉద్యమాలు, చేసిన కృషిని వివరించారు. అయినప్పటి కి స్పందించ కుండా ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఖమ్మంలో పేదలకు తెలుగుదేశం హయంలోనే స్థలాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, నలుగురు ఇన్‌చార్జీ మంత్రులు, నలగురు కలెక్టర్లు, ముగ్గురు ఆర్‌డిఓలు, ముగ్గురు తహసీల్దార్లు మారారని అయి నప్పటికి ఇంతవరకు పేదలకు న్యాయం జరగలేదని అన్నారు. అందు వల్లనే తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తుమ్మల దీక్షకు పూనుకున్నారని సమస్య పరిష్కారం అయ్యెవరకు దీక్ష కొనసాగుతుందని అన్నారు.

పేదల ఇళ్ళ స్థలాలకోసం మాజీమంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరావు చేపట్టిన నిరవధిక దీక్షకు సిపిఐ మద్దతు ప్రకటించింది. దీక్ష శిభిరం వద్దకు ఆపార్టీ రాష్ర్త కార్యదర్శి వర్గ సభ్యులు సిద్ది వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యాదర్శి బాగం హేమంతరావు, మహిళా సంఘం నాయకులు పోటు కళావతి, తాటి నిర్మలు వచ్చి తుమ్మ లకు మద్దతుతెలిపారు. ఈసందర్బంగా సిద్ది,భాగం మాట్లా డుతూ ఖమ్మంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం సీనియర్‌ నాయకులు జిల్లా అభివృద్దిలో తన దైన ముద్రవేసిన తుమ్మల నాగేశ్వరరావు నిరహర దీక్ష చేపట్టడం అంటే చిన్న విషయం కాదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చి దీక్షను విరమింప చేయక పోతే ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అవస రమైతే జిల్లా బంద్‌ కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు.