April 4, 2013

రైతులను భిక్షాధికారులుగా చేస్తున్న.. ప్రభుత్వాన్ని గద్దెదింపాలి

మిర్యాలగూడ : రైతులను లక్షాధికారులను చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వారిని భిక్షాధికారులుగా మారు స్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ అన్నారు. పెంచిన విద్యుత్‌చార్జీలు ఉపసంహరించాలనే డిమాండ్‌తో మిర్యాలగూడలోని 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట  టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీల్యానాయక్ మాట్లాడుతూ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, 2014వరకు విద్యుత్ చార్జీలు పెంచబోమని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

అప్రకటిత విద్యుత్ కోతలు, కరువు, కాటకాలు, పెరిగిన ధరలతో అవస్థలెదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి బాధించడం దుర్మార్గమని అన్నారు. విద్యుత్ సమస్యలపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు సభలో పట్టుబడితే ప్రభుత్వం తప్పించుకుందని, శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే వాటిని భగ్నం చేశారని విమర్శించారు. తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలో రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పలు పథకాలు అమలు చేశామని, వ్యవసాయానికి నిక్కచ్చిగా ఏడుగంటలు విద్యుత్ ఇచ్చామని తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించామన్నారు.

ధర్నా అనంతరం ట్రాన్స్‌కో డీఈకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి దుర్గాప్రసాద్, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని శ్రీనివాసరావు, త్రిమెన్ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు పెద్దిశ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు ఎస్‌కే.జానీ, తిరందాసు విష్ణు, పట్టణ ప్రధాన కార్యదర్శి పాతూరి ప్రసాద్, మండల అధ్యక్ష, కార్యదర్శులు మంగ్యానాయక్, పులి విద్యాసాగర్, కాటూరి సత్యనారాయ ణ, కోడిరెక్క విజయ్‌కుమార్, దైద వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాస్, మాజీద్, నక్కసంధ్య, రమాదేవి, హు స్సేన్‌నాయక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రాస్తారోకో

వేములపల్లి : విద్యుత్ చార్జీల పెం పును నిరసిస్తూ టీడీపీ మండల నాయకులు సోమవారం నార్కట్‌పల్లి- అ ద్దంకి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మం డల అధ్యక్షుడు జెర్రిపోతుల రాములుగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా మల్లేష్‌గౌడ్ మాట్లాడారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జడ రాములుయాదవ్, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎస్‌కె. రసూల్, ఉగ్గె శివకుమార్, జడ సైదులు, రమేష్, వెంకటేశ్వర్లు, అర్వపల్లి, లతీఫ్, సాయి, అక్బర్, నరేష్ పాల్గొన్నారు.

వామపక్షాల దీక్ష

వేములపల్లి : పెంచిన విద్యుత్‌చార్జీలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ఒక్క రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మాలి పురుషోత్తంరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాపో లు భాస్కర్. సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు రావు ఎల్లారెడ్డి, జిల్లా యాదగిరి, రైతు సంఘం నాయకులు మిర్యాల మధుసూదన్, కొండేటి జలంధర్, కర్ర ఇంద్రారెడ్డి, వి. నాగేందర్, రెండి శ్రీను, మాజీ సర్పంచ్‌లు శశిధర్‌రెడ్డి, కృపాకర్‌రావు పాల్గొన్నారు.

దామరచర్ల : పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించక పోతే కాంగ్రెస్ ప్రభు త్వాన్ని గద్దెదించేదాక పోరాడుతామని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నా రు. సోమవారం మండల కేంద్రంలో పెంచిన విద్యుత్‌చార్జీలను ఉపసంహ రించుకోవాలని కోరుతూ వామపక్షాల పిలుపు మేరకు చేపట్టిన సామూహిక నిరాహారదీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చంద్రశేఖర్‌యాదవ్, సీపీఐ మం డల కార్యదర్శి సైదులు, సీఐటీయూ మండల కార్యదర్శి పాపానాయక్, ఏఐవైఎఫ్ డివిజన్ కార్యదర్శి లింగానాయక్, వినోద్, దయానంద్, ప్రకాశ్, శోభన్, లింగారెడ్డి, గోపి, లక్ష్మినర్సింహారెడ్డి, సుభాని, కాంతారావు పాల్గొన్నారు.