April 4, 2013

ప్రభుత్వ అసమర్థతతో తాగునీటి కష్టాలు

ఒంగోలు కలెక్టరేట్: ప్రభుత్వ అస మర్థతతో జిల్లా ప్రజానీకం తాగునీటి కోసం రోడ్డున పడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని తెలుగు రైతు రాష్ట్ర అధ్య క్షుడు కరణం బలరామకృష్ణమూర్తి ధ్వజ మెత్తారు. సాగర్ జలాలను విడుదల చేసి తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ తెలుగుదేశంపార్టీకి చెందిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి  స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన అమరణ నిరాహారదీక్షను బలరాం ప్రా రంభించారు.

ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే కందుల నారా యణ రెడ్డి గత 15 రోజుల నుంచి జిల్లా కు సాగర్ జలాలను విడుదల చేసి తాగు నీటి కష్టాలను తీర్చాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖల అధికా రులు చుట్టూ తిరిగినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మార్కాపురం పట్టణంతోపాటు మార్కాపురం, కనిగిరి, దర్శి, ఒంగోలు, సంతనూతలపాడు, అ ద్దంకి, పర్చూరు తదితర నియోజకవ ర్గాల్లో తాగునీటి చెరువులు ఎండిపోయి, సమ్మర్ స్టోరేజ్‌ల్లో నీరులేక ప్రజానీకం కిలోమీటర్ల దూరం వెళ్ళి నీటిని తెచ్చు కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నా రు.

శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉన్నా ఆ నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బలరాం ధ్వజమెత్తారు. హైకోర్టును తీర్పును సాకుగా చూపి శ్రీశైలం ప్రాజెక్టులో 860 అడుగల నీరు ఉన్నా ప్రభుత్వ ఆసమర్థత కారణంగా నీటిని విడుదల చేయడం లేదని కరణం బలరాం పేర్కొన్నారు. హైకోర్టు 834 అడుగులకు తక్కువగా ఉండకుండా చూ డాలని ఆదేశిస్తే దానిని సాకుగా చూపి ప్రజానీకానికి నీరు లేకుండా చేస్తున్నదని ధ్వజమెత్తారు. శ్రీశైలం నుంచి విడుదల చేసి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ తాగునీటి అ వసరాలను తీర్చవచ్చునని తెలిపారు.

ప్రభుత్వం ఇదే విధానాలను వ్యవహరిస్తే ప్రజానీకం తాగునీటికోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థి తులు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సాగర్‌జలాలను విడుదల చేయాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని బలరాం హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యు డు శిద్దా రాఘవరావు మాట్లాడుతూ జి ల్లా ప్రజానీకం తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన మార్కా పురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్ద డిని గుర్తించి గత 20 రోజుల నుంచి సాగర్ జలాలను విడుదల చేయాలని మంత్రులు, నీటిపారుదల శాఖ అధికా రులు, జిల్లా కలెక్టర్ చుట్టూ తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పో యిందన్నారు.

దర్శి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకునుంచి పొదిలి, కొనకనమిట్ల ప్రాంతాలకు 11 రోజులకు ఒక పర్యాయం నీరు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఆర్థం చేసుకోవచ్చునని తెలిపారు. తాగునీటి అవసరాలను తీర్చలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ధ్వజ మెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి వెంటనే సాగర్ జలాలను విడుదల చేసి ప్రజానీకాన్ని అదుకోవా లని లేని పక్షంలో దీక్షను విరమించేది లేదని నారా యణ రెడ్డి హెచ్చరించారు. కందుకూరు, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ దివి శివరాం, పిడతల సాయికల్పనారెడ్డి మా ట్లాడుతూ జిల్లా ప్రజలు పడుతున్న కష్టాలు చూసి సాగర్ జలాలు విడుదల చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నిరెత్తి నట్లు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెం టనే సాగర్‌జలాలను విడుదల చేయా లని డిమాండ్ చేశారు.

అమరణ నిరాహారదీక్ష చేపట్టిన కం దుల నారాయణరెడ్డిని కరణం బలరాం తో పాటు బలరాం తనయుడు కరణం వెంకటేష్ తదితరులు పూలమాలలు వేసి అభినందించారు. మరో వైపు నారాయణ రెడ్డికి మద్దతుగా గఫూర్, రవికుమార్ రెడ్డి, చెన్నకేశవులు, వెంకట్రావు, రామ లింగం, కె.సుబ్బారెడ్డి, దాసు తదితరులు దీక్షలో కూర్చున్నారు.

ఈ కార్యక్రమంలో కొండపి నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జి డోలా బాల వీరాం జనేయులు, పార్టీ జిల్లా ప్రధాన కార్య దర్శి యర్రాకుల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం, కొ మ్మూరి రవిచంద్ర, యానం చిన యోగ య్య యాదవ్, బొల్లినేని వాసు కృష్ణ, టి.అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, మేరీ రత్నకుమారి, గుర్రం ఆదిశేఖర్, చిరం జీవి తదితరులు దీక్షలో పాల్గొని కందు లకు సంఘీభావం తెలిపారు.