April 4, 2013

విద్యుత్ సమస్యపై నిరసనల హోరు

చెన్నేకొత్తపల్లి: విద్యుత్ సంక్షోభం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుణ్యమేనని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సు నీత ధ్వజమెత్తారు. మడలంలోని దా మాజిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం వందలాదిమంది రై తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైఠాయించి, నిరసన తెలిపారు. దీంతో రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విషయం తె లుసుకున్న చుట్టుపక్కల గ్రామాలవాసులతో పాటు మహిళలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని, ఎమ్మెల్యేకు బాసటగా నిలిచారు. వెంటనే పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అంతకుమునుపు ఎన్ఎస్ గే టుకు చేరుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి, కనగానపల్లి, సీకే ప ల్లి మండలాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులతో కలి సి ర్యాలీగా జాతీయరహదారి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకం గా కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అనంతరం రో డ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పెంచిన విద్యుత్‌చార్జీల పెంపు, కోతలపై తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఎ మ్మెల్యే నిప్పులు చెరిగారు. పాలకుల అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వచ్చిందని విమర్శించారు. సిగ్గుమాలిన ప్రభుత్వానికి రోజులు ద గ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. ఈ నిరసనలో నాయకులు ఎల్.నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, నెట్టెం వెంకటేశు, పరిటాల గజ్జలప్ప, శ్రీరామ్‌నాయక్, కనగానపల్లి మాజీ ఎంపీ పీ అలివేలమ్మ, మాడెం సూర్యనారాయణరెడ్డి, రఘునాథరెడ్డి, న్యామద్దల కిష్టప్ప, తెలుగుయువత నరసింహు లు, గేటు కిష్టప్ప, హరినాథరెడ్డి, రామచంద్రారెడ్డి, నాగేంద్రచౌదరి, రామకృష్ణారెడ్డి, డిష్ వెంకటేష్, రామంజి, ము రళీ, శ్రీరాములు, అంకే ఆంజనేయు లు, మల్లికార్జున, దేవరాజు, బావిరెడ్డి, మహిళలు, రైతులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అరెస్టు...

విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ జాతీయరహదారిపై ఎమ్మెల్యే సునీత చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీపులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి ది గారు. ధర్నాను విరమించే ప్రసక్తే లేద ని భీష్మించారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే ఉండదన్నారు. ఎమ్మెల్యేతోపా టు కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి అందరినీ పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.