April 4, 2013

కాంగ్రెస్ హయాంలో భ్రష్టుపట్టిన పాలన

రాజాం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం పూర్తిగా భ్రష్టుపట్టుకుపోయిందని టీడీపీ రాష్ట్రఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభాభారతి ఆరోపించారు.గురవాం గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడారు.ప్రభుత్వం మోపిన విద్యుత్‌భారాన్ని తగ్గించేందుకే సంతకాల సేకరణ చేపడుతున్నట్టు తెలిపారు. సంతకాలు సేకరించి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళి చార్జీల భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గురవాన నారాయణరావు,పీఏసీఎస్ అధ్యక్షుడు వంగా గోవిందరావు, మండలకార్యదర్శి పొన్నాడ పురుషోత్తంనాయుడు, మండల తెలుగుయువత అధ ్యక్షుడు వంగా గోవిందరావు, టంకాల కన్నంనాయుడు, శాశపు రాజేష్, రౌతు రాజు, సీహెచ్ రాంబాబు, రౌతు చినలక్ష్ముం, మీసాల ఆదినారాయణ, స్వామినాయుడు పాల్గొన్నారు.

చేతకాని ప్రభుత్వ గద్దె దిగాలి పాతపట్నం: చేతకాని ప్రభుత్వం గద్దెదిగాలని టీడీపీ ్ట జిల్లా అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు డిమాం డ్‌చేశారు.పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించాలని విద్యుత్ సరఫరా వైఫల్యాలపై నిరసిస్తూ మంగళవారం పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంతకాల సేకరణను నిర్వహించారు.ఈకార్యక్రమంలో నాయకులు కొంచాడ వీరభద్రరావు శాసనపురి మధుబాబు పైల బాబ్జి పాల్గొన్నారు