April 4, 2013

విద్యుత్ సంక్షోభానికి వైఎస్సే కారణం

నెల్లూరు - బారకాసు: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డే కారణమ ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. 46 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మ ర్చంట్ పవర్‌ప్లాంట్లకు అప్పగించిన వె ౖఎస్సార్ అందులో ఒక్క మెగావాట్ కూ డా రాష్ట్రానికి సద్వినియోగం అయ్యే అవకాశం లేకుండా చేశారన్నారు. స్వ లాభం కోసం బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ విధానాలపై చెప్పేదొకటి చేసేదొకటిగా ఉందన్నారు. టీడీపీ, కాం గ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరాలో ఎవరు ఎలాంటి విధానాలు అమలు చే శారో తేల్చుకుందామంటూ సవాల్ వి సిరారు.

ప్రస్తుత విద్యుత్ సంక్షోభం వల్ల రాష్ట్రంలో 20 వేల చిన్నపరిశ్రమ లు మూతపడి 20 లక్షల మంది కార్మికులు నిరాశ్రయులయ్యారన్నారు. గ్రా మాలలో ఆరు గంటల విద్యుత్ సరఫ రా చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించి, సర్‌చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలంటూ గురువారం నుంచి ఈ నెల 14 వరకు గ్రామస్థాయి లో సంతకాల సేకరణ చేస్తున్నామ న్నా రు. సేకరించిన సంతకాల కాగితా లతో 15వ తేదీన ఊరేగింపు చేపడతామన్నా రు.

16న సంతకాల పత్రాలను ఎమ్మెల్యేలకు, స్థానిక నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు అందజేస్తామన్నారు. 21న టీడీ ఎల్పీ సమావేశం నిర్వహించి 22న రాష్ట్ర గవర్నర్‌కు నిరసన సంతకాల ప్రతులను అందిస్తామన్నారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అన్నం దయాకర్‌గౌడ్, ఒట్టూరు సంపత్‌కుమా ర్, బద్దెపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.