March 29, 2013

ఎమ్మెల్యేల దీక్ష కు మద్దతుగా కొవ్వొత్తులతో ప్రదర్శన

ఆర్మూర్ అర్బన్: విద్యుత్ కోతలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆర్మూ ర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో గురువారం డీఈ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కోతలతో పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం హామీలను విస్మరించిందని విమర్శించారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జీవీ.నర్సింహరెడ్డి, తెలుగు యువత పట్ట ణ అధ్యక్షులు జక్కుల రాజేశ్వర్, గాండ్లసాగర్, చేత న్, పోహర్‌కిరణ్, నూకల ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

'కాంగ్రెస్‌కు రైతులే గుణపాఠం చెబుతారు'

భీమ్‌గల్: రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతు సమస్యల్ని విస్మరించి రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ 9 గంటలు నాలుగు గంటలకు కుదించిందని, అయిన విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. భీమ్‌గల్ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ గంగాధర్‌గౌడ్ వి లేకరులతో మాట్లాడారు.

నాలుగు రోజులుగా విద్యుత్ సమస్యపై హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు విద్యుత్ సమస్యలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభు త్వం ఏ మాత్రం స్పందించకపోవడం ఎంత వరకు సబబని అన్నారు. కరెంటు సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఏడు గంటల విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటనలు చేస్తూ నే కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజస మన్నారు. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం దిగిరాకపోతే 1నుంచి ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని అన్నారు వీరితో పాటు మండల టీడీపీ నాయకులు పతాని లింబాద్రి, నాగుల భూమన్న, వీరాచారి, హకీం, ఖలీం ఉన్నారు.