March 29, 2013

నాయకులు మోసం చేస్తున్నారు.. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు..

బిక్కవోలు: తెలుగుదేశంపార్టీలో కొంతమంది లీడర్లు మోసం చేస్తున్నా రు, కానీ కార్యకర్తలు మోసం చేయకుం డా ఏళ్ల తరబడి తమవెంటే ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో గురువారం ఆయన బిక్కవోలు మండలంలో రామచంద్రపురం, జగ్గంపేట నియోజకవర్గాలలోని దేశం కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక లీడరు పోతే 50 మంది లీడర్లను తయారుచేసే శక్తి టీడీపీకి ఉందన్నారు. తమ కార్యకర్తలు చూసి రమ్మం టే కాల్చి వస్తారని కితాబునిచ్చారు. తాను కార్యకర్తలను కుటుంబసభ్యులు గా బావిస్తున్నానన్నారు.

గతంలో తా ను ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి కార్యక్రమాలు చేపట్టినా 294 నియోజకవర్గాలలోని కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి వీలులేకుండా పోయిందని అందువల్లే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నాకు ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఇప్పటివరకు కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పులో 10 నియోజకవర్గాలలోని కార్యకర్తలతో సమీక్షలు జరిపానన్నారు. వైఎస్ 200 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నా కార్యకర్తలు దేశం వెంటే ఉన్నారన్నారు. నిరాశ పడకుండా తమ పార్టీచేసిన పనులను ప్రజలకు వివరించి ఎదుటి పార్టీ వాళ్లను ఢీకొట్టినపుడే తిరిగి అధికారం లోకి వస్తామన్నారు. కార్యకర్తలకు మరింత చేరువ కావడానికి నియోజకవర్గ ఇన్‌చార్జిలు, బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. మీ సమస్యలను తెలపాలని నియోజకవర్గాలవారీగా కార్యకర్తల నుంచి తెలుసుకుని నోట్ చేసుకున్నారు.

రామచంద్రపురం నుంచి యనమదల రవి, జగ్గంపేట నుంచి అల్లు విజయకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బాబు సమక్షంలో పార్టీలో చేరారు. సమావేశంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట టీడీపీ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు, కొండయ్యదొర, అప్పలరాజు, జగ్గంపేట, రామచంద్రపురం కార్యకర్తలు పాల్గొన్నారు.

జగ్గంపేట: కృషి, పట్టుదల ఉంటే మనిషి సాధించలేదని ఏదీలేదని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోస పాదయాత్ర లో భాగంగా ఆయన బిక్కవోలులో జగ్గంపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. జగ్గంపేటలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని యువకుడు, ఉత్సాహవంతుడు అయిన చంటిబాబును ముం దుకు తీసుకువెళ్లాలని సూచించారు. రెండుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు పార్టీ స్థితిగతులపై పార్టీకార్యకర్తలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని సూచించగా పలువు రు కార్యకర్తలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

గోకవరం మండలానికి పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ వెనుకబడి ఉందని సహాకార సంఘ ఎన్నికల్లో తామంతా కష్టించి పనిచేసి పిల్ల కాంగ్రెస్‌కు గట్టిపోటీనిచ్చామని ఒ క్కఓటు మెజార్టీతో సొసైటీని కోల్పోయామని వాపోయారు. పార్టీతో సం బంధం లేకుండా 14లక్షలు రూపాయ లు ఖర్చుపెట్టి ఓడిపోయిన తమను పా ర్టీపరంగా నాయకులు ఎవరూ కనీసం పరామర్శకు రాలేదని ఆవేశంగా ప్రసంగించారు. చంద్రబాబు సైతం అదే స్థాయిలో ప్రతిస్పందించి నాయకులను సరిదిద్దే బాద్యతలను తాను చేపడతానని నిరుత్సాహపడవద్దని భరోసా ఇ చ్చారు.

చంద్రబాబు నేరుగా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను సేకరించడంతోపాటు
రా నున్న ఎన్నికల్లో ప్రణాళికాపరంగా పార్టీకి ఏవిధంగా పనిచేస్తే విజయం సాధించగలమనే అంశాన్ని సూటిగా కార్యకర్తలకు అర్ధమయ్యే రీతిలో విశదపరిచారు. మరో వైపు పార్టీశ్రేణులను ఇంకో వైపు పార్టీ నాయకులను సైతం ఆయన సుతిమెత్తగా తనదైన శైలిలో చురకలు వేస్తూ సమీక్షను కొనసాగించారు. గతంలో మాదిరి హెచ్చరికలు, హూంకరింపులు లేకుండా ముఖంపై చిరునవ్వు చెరగనీయకుండా ఆద్యం తం చంద్రబాబు సమీక్షను కొనసాగించడంతో కార్యకర్తలు, నాయకుల్లో ఆనందాలు వ్యక్తమవుతున్నాయి.