December 17, 2012

సమస్యలు వింటూ... ముందుకు సాగుతూ..

మెట్‌పల్లి/మల్లాపూర్/ఇబ్రహీంపట్నం: మల్లాపూర్ మండలంలో ఆదివారం మూడో రోజు చంద్రబాబు నిర్వహించిన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించారు. మండలంలోని గొర్రెపల్లి గ్రామం నుంచి రేగుంట వర కు చంద్రబాబు పాదయాత్ర జరిపారు. దారి పొడవునా రైతులను, మహిళలు, విద్యార్థులను, యువకులను, కార్మికుల ను పలకరిస్తూ... బాధలు తెలుసుకుం టూ... భరోసా ఇస్తూ... హుషారు హు షారుగా పాదయాత్ర నిర్వహించారు. పంట చేలోకి వెళ్లి రైతుల బాధలను ఆరా తీశారు. విద్యార్థులను పలకరించి సమస్యలు విన్నారు. ఇలా ఆద్యంతం బాబు పాదయాత్ర హుషారుగా జరిగింది. పాదయాత్ర ప్రారంభించినప్ప టి నుంచి చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. మండలంలోని గొర్రెపల్లిలో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బాబు పాదయాత్ర కొనసాగించారు. ముందుగా విద్యార్థులు వెల్లబోసుకు న్న గోడును బాబు ఆలకించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అక్కడి నుం చి పాదయాత్రను రేగుంట వైపు కొనసాగించారు.

దారి మధ్యలో సుమారు పది మంది రైతులను బాబు కలిసి సమస్యలు తెలుసుకున్నారు. దారి వెం ట వెళ్లే విద్యార్థులను, మహిళలను పలకరిస్తూ సాగారు. ఓ మానసిక వికలాంగుడు, ఓ వృద్ధునికి చంద్రబాబు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. రే గుంట శివారులో టీ బ్రేక్ తీసుకున్నారు. అనంతరం రేగుంటలోని అం బేద్కర్ చౌరస్తా వద్ద సుమారు గంటపాటు ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అక్కడి నుంచి రేగుంట శివారులోని బ్రిడ్జి మీదుగా జగిత్యాల నియోజవకర్గంలోని ఇంటిక్యాల వరకు పాదయాత్ర కొనసాగించారు. ఇటిక్యాలలో బాబు రాత్రి బస జరపనున్నారు.

బీడీ కార్మికుల సమస్యలపై...: మెట్‌పల్లి/మల్లాపూర్ : బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికై గతంలో తాను మెట్‌పల్లిలో ధర్నా నిర్వహించానని, మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొ చ్చి ఇబ్బందులు తొలగించడానికి ప్ర యత్నిస్తానని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం నిర్వహించిన వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా రేగుంటలో నిర్వహించిన రోడ్‌షోలో బాబు మాట్లాడారు. గతంలో పుర్రె, శవం గు ర్తులను తొలగించడానికి కార్మికులు మెట్‌పల్లిలో చేసిన ఉద్యమంలో తాను పాల్గొనడం జరిగిందని గుర్తు చేశారు. ఓ బీడీ వర్కర్స్ యూనియన్ నాయకుడు కార్మికుల సమస్యలపై చంద్రబాబుకు వివరించారు. సార్ మాకు తీవ్రం గా అన్యాయం చేస్తున్నారు.

కనీస వేత నం కూడా ఇవ్వడం లేదు. వెయి బీడీలకు రూ. 110 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు పెరిగిన ధరలతో ఎలా బతకాలో తెలియడం లేదంటూ ఆవేదన వ్య క్తం చేశారు. మొదట్లో జీఓ 41 జారీ చేసిన తర్వాత తమకు న్యాయం చే యాలంటూ వేడుకున్నారు. దీంతో స్పందించిన బాబు బీడీ కంపెనీల యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్మ క్కై కార్మికుల పొట్టకొడుతున్నారన్నారు. అలాగే టీఆర్ఎస్ నేత కేసీఆర్ కేం ద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కట్టలపై పుర్రె, శవం గుర్తు వేసినా పట్టించుకోలేదని విమర్శించారు. వాటిని తొలగించాలని నేనూ మెట్‌పల్లికి వచ్చి ధర్నా చేశానని తెలిపారు. అప్పుడు ఆ గుర్తులు తొలగించారని చెప్పారు.

ప్రసంగం తీరులో మార్పు..: తన ప్రసంగం తీరులో స్వల్ప మార్పులు చేశానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అ న్నారు. వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రజలనుద్దేశించి మా ట్లాడారు. తాను హిందూపూర్‌లో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి తాను ప్రసంగించడం ప్రజలు వినడం, తదుపరి ప్రజలతో మాట్లాడించి సమస్యలు తెలుసుకోవడం వంటి పద్ధతులు పాటించానని అన్నారు. కాగా తన ప్రసంగానికి ముందే వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడించి సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఈ పద్ధతి ద్వారా ఎజెండాను ప్రజలు నిర్ణయిస్తారని, నాయకులు పాటించి ప్రసంగించాల్సి ఉంటుందన్నారు. సమస్యలను తెలుసుకోవాలన్న సదుద్దేశంతో మా ర్పు తీసుకురావడం జరిగిందన్నారు.