December 16, 2012

టీడీపీని భూస్థాపితం చేయాలనే కుట్ర

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని చెప్పదు..కానీ అన్ని పార్టీలను చెప్పమంటారు.. ఇదెక్కడి న్యాయం.. కాంగ్రెస్ పార్టీకీ బాధ్యత లేదా.. అధికారంలో ఉన్నది మీరు కాదా.. సమస్యను ఎందుకు పరిష్కరించరూ.. తెలుగుదేశం పార్టీని ఏదో ఒక ప్రాంతంలో భూస్థాపితం చేయాలని కుట్ర పన్నుతున్నారు.. ఈ పార్టీని కా పాడాల్సిన బాధ్యత నాపై ఉంది.. లేకుంటే పెత్తందారులు, భూస్వాముల పాలన వస్తుంది.. అని చంద్రబాబు నా యుడు అన్నారు. మీ కోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా రెండో రోజు ఆదివారం ఆయన గొర్రెపల్లి నుంచి రేగుంట, ఇటిక్యాల వరకు 8.7 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించా రు.

గొర్రెపల్లి పాఠశాలలో శనివారం రాత్రి బస చేసిన చంద్రబాబు మధ్యా హ్నాం 3 గంటల తర్వాత పాదయాత్రను ఆరంభించారు. మార్గమధ్యంలో రైతులు, గొర్రె కాపరులు, మహిళలు, విద్యార్థులను పలకరించి వారి సమస్య లు తెలుసుకున్నారు. రేగుంట, ఇటిక్యా ల సభల్లో ఆయన రైతులు, విద్యార్థు లు, బీడీ కార్మికులు, ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకుని నేనేమి చేయాలో చెప్పండి అంటూ సలహాలు స్వీకరించారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని చెప్పకుండా తమను చెప్పాలనడం ఇదెక్కడి న్యా యమని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతంలో భూస్థాపితం చేయాలని కుట్ర పన్నుతున్నారు.. ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్ ఎంపీలను బుజ్జగించడానికే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు తప్ప తెలంగాణ సమస్య పరిష్కారానికి కాదని ఆయన అన్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారట కానీ, తమ అభిప్రాయం మాత్రం చెప్పరు. సమస్య పరిష్కారానికి బాధ్యత తీసుకోరు. అని ఆయన కాంగ్రెస్‌ను విమర్శించారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తానెప్పుడూ తె లంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్తులోనూ మాట్లాడనని చంద్రబాబు నాయుడు మరోసారి స్ప ష్టం చేశారు. సామాజిక తెలంగాణ జేఏసీ నాయకులు జెండాలు పట్టుకుని ఆయనకు మద్దతుగా పాదయాత్ర చే శారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో కి రాగానే వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించి కరెం ట్ ఛార్జీలను తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా మల్లాపూర్ మండలం రేగుంట సభలో మాట్లాడు తూ వ్యవసాయానికి 7 గంటల విద్యు త్తు సరఫరా లేక పంటలు ఎండి పో యి రైతులు నష్ట పోతున్నారని అన్నా రు. టీడీపీ అధికారంలోకి రాగానే వి ద్యుత్తును మెరుగు పరిచి ఆ శాఖ పనితీరు మారుస్తానని అన్నారు.

9 గం టల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు కరెంట్ చార్జీ లు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో అనేక మందికి ఉద్యోగాలు కల్పించామని 11 సార్లు డీఎస్సీ నిర్వహించి లక్షా 65 వేల మం దికి ఉద్యోగాలిచ్చామన్నారు. బీఇడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా తాము అవకాశం కల్పిస్తే ఈ ప్రభుత్వం ఎస్జీటీగా అవకాశం లేకుండా చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది బీఇడీ అభ్యర్థులున్నారని వారందరికీ పాత పద్ధతిలోనే డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేస్తానని చె ప్పారు. బీడీ కార్మికులకు నెలకు 1500 పెన్షన్ ఇప్పించేందుకు పోరాటం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

రేగుంట గ్రామంలో సామాజిక తెలంగాణ జేఏసీ నాయకులు జెండాలు పట్టుకుని సామాజిక తెలంగాణ కావాలని నినాదాలు చేశారు. మాకు దొరల తెలంగాణ వద్దని, సామాజిక తెలంగాణ కావాలని, చంద్రబాబు ద్వారానే అది సాధ్యమవుతుందని సామాజిక తె లంగాణ జేఏసీ నాయకులు కోరారు. అక్కడే తెలంగాణ రావాలే అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు సీహెచ్ విజయరమణారావు, సుద్దాల దేవయ్య, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు శికారి విశ్వనాథం, వేం నరేందర్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పి రవీందర్ రావు, కర్రు నాగయ్య, పుట్ట కిశోర్, గండ్ర నళిని, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, గోపు అయిలయ్య యాదవ్, ముద్దసాని కశ్యప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రాజేశం, అన్నమనేని నర్సింగరావు, తెలుగు యువత అధ్యక్షులు గౌతం కృష్ణ, టీడీపీ బీసీ విభా గం అధ్యక్షులు అడ్లగట్ల లక్ష్మినారాయ ణ, నాయకులు సంకు సుధాకర్, ఎస్ ప్రభాకర్ రెడ్డి, ఒంటెల సత్యనారాయ ణ రెడ్డి, అమీనా బేగం పాల్గొన్నారు.