December 17, 2012

ఏడిపించే సర్కారు ఏట్లో పడా!

'వైద్యో నారాయణో హరి' అంటారు. పేదవాడి ఫ్యామిలీ డాక్టర్లుగా గౌరవం పొందే ఆర్ఎమ్‌పీ, పీఎంపీలూ రోడ్డెక్కాల్సి రావడం బాధాకరం. రాయికల్ దాటగానే..టెంటు వేసుకొని నా కోసం వాళ్లంతా ఎదురుచూస్తూ కనిపించారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కదిలిస్తున్నకొద్దీ తమ కష్టాలను కుప్పపోశారు. గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ల సేవలు ఎంతో అమూ ల్యమైనవి. ఈ విషయం పల్లెలో బతికే ఎవరిని కదిపినా తెలుస్తుంది. పేదల ఇళ్లలో సొంత మనుషుల్లా వీళ్లు మెసులుతారు. మొగుడూపెళ్లాల గొడవల నుంచి ఊరి సమస్యల దాకా వీళ్ల ను దాటి ఏ సమస్యా పక్కకు పోదు.

పిల్లలను ఆడిస్తూ, అవ్వలను ఆట పట్టిస్తూ 'మామయ్యా' 'మనవడా' అని పిలిపించుకుంటూ వృత్తి ధర్మాన్ని విధిగా నిర్వహించే కర్మజీవులు వీళ్లు. వైద్యసేవలకు దూరంగా ఉండే పల్లెలో వీళ్ల సేవలే ప్రాథమిక ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. అలాంటి ఆర్ఎమ్‌పీలు, పీఎంపీలు రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. గ్రామీణ వైద్యానికి వెన్నుదన్నుగా ఉన్న వీళ్ల వెన్నుముకను ప్రభుత్వం విరుస్తోంది. వాళ్లకు కాస్తంత శిక్షణ ఇచ్చి గుర్తింపు ఇస్తే మరింత మెరుగ్గా వైద్యసేవలు అందిస్తారు. ఆ విషయమై నేను ప్రభుత్వానికి లేఖ రాస్తే, మొదట్లో కొంత స్పందించినా ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. వీళ్లను కాపాడుకోకుండా మంచం పట్టిన గ్రామీణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ కష్టమే.

అల్లీపూర్‌లో అడుగు పెట్టగానే ఆడపడుచులు చుట్టూ గుమిగూడారు. సొంత మనిషిని చూసిన ఆనందం వాళ్ల కళ్లలో చూడగలిగాను. చేతుల్లో ఏవో స్లిప్పుల్లా ఉన్నాయి. వాటిని విసురుగా నావైపు చాపి గోడు వెళ్లబోసుకున్నారు. " ఒకనాడు 150 రూపాయలు దాటేది కాదు. ఇప్పుడేమో 500 రూపాయలపైనే బిల్లు వస్తోంది సారూ.. మా ఇంట్లో చూడు.. రెండు బల్బులన్నా ఉన్నాయా? బిల్లు మాత్రం వెయ్యి రూపాయలు తేలింది'' అని ఆ మహిళలు వాపోయారు. "ఇంతగా ఏడిపిస్తున్న సర్కారు ఏట్లో పడా'' అని వాళ్లు శా