December 18, 2012

ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయండి

రైతులు వరినార్లు పోసుకున్నారు.. శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయమంటే చేయడం లేదు. మీనమేషా లు లెక్కించకుండా.. తక్షణమే నీటిని వి డుదల చేసి సీజన్ పోకుండా చూడాల ని టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు సీఎంను హెచ్చరిస్తూనే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీఇచ్చారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాలోని రా యికల్ జూనియర్ కళాశాల నుంచి రా యికల్, కుమ్మరిపల్లి, ఉప్పుమడుగు, అ ల్లీపూర్, కిష్టంపేట వర కు 14.4 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికా రు. విద్యార్థులు, మహిళలు మంగళహా రతులు పట్టారు. గుస్సాడీ నృత్యాలు, డప్పుల చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఆ యా గ్రామాల్లో జరిగిన సభల్లో నేనే మి చేయాలి.. మీరేం చేస్తారో.. చెప్పాల ని ప్రజల చేతికి మైకు ఇచ్చి చర్చ పెట్ట డం ఆసక్తిని రేకెత్తించింది. అల్లీపూర్ గ్రా మంలో 'ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చే యడంలేదు. వరి నార్లు పోసుకున్నాం. ఆ నీటితో మా ఊరి చెరువులు నింపే ప్రయత్నం చేయాలని రైతు ఎంబళ్ల నర్సయ్య. కరెంట్ బిల్లు లు బాగా వస్తున్నాయని, డెవలప్‌మెంట్ చార్జీలు వేస్తున్నారని తట్టుకోలేకపోతున్నామని బిల్లు లు తగ్గించేందుకు చొరవ చూపాలని సతీష్. 500 రూపాయల బిల్లుకు 1400 వచ్చిందని, వాటిని తగ్గించాలని గుండవేని చిన్నక్క వాపోయింది. అలాగే దారి పొడవునా... నా భర్త గల్ఫ్‌లో చనిపోయి ఏడాదిన్నరయ్యింది. ఇంత వర కు శవం రాలేదు. ఈ మధ్యనే కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. పట్టించుకునే వాళ్లులేరు.

నా భర్త ముఖం చూసుకునేందుకైనా శవాన్ని తెప్పించండని దండుగుల చిన్నక్క... మా కాలనీలో రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు. మీ రైనా పట్టించుకోవాలని ఒడ్డెర కాలనీ వాసులు మొర పెట్టుకున్నారు. మాకు బడికి పోయేందుకు సైకిళ్లు లేవు. సైకిళ్లు ఇప్పించాలని ఓ విద్యార్థిని..మాకు శిక్ష ణ, గుర్తింపు ఇస్తామన్న ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. మీరైనా మాకు ఉండి పోరాటం చేయాలని ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు. రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంపౌండ్ వాల్ లేదని, కరెంట్ లేదని, మరుగుదొడ్లు లేవని వీటిని పరిష్కరించాలని విద్యార్థులు.. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సరిపోవడం లేదని రెండు, మూ డుసార్లు ధర్నాలు చేశామని పెన్షన్ పెం చాలని ఓ వికలాంగుడు.. కుల వృత్తి గి ట్టుబాటు కావడం లేదని, ఎక్సైజ్ పన్ను రద్దు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇప్పించాలని గీత కార్మికులు.. మాకు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వాలని, దోబీఘాట్ల ని ర్మాణం చేపట్టాలని ఓ రజకుడు.. సబ్సిడీపై నూలు ఇవ్వాలని చేనేత కార్మికు లు.. చెరువులను అభివృద్ధి చేసి, స బ్సిడీపై చేప పిల్లలను ఇవ్వాలని గంగపుత్రులు.. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలని మ హిళా రాజ్యాధికార సంఘం సభ్యులు.. ఇలా దారి పొడవునా రైతులు, విద్యార్థులు, మహిళలు, కులవృత్తుల వాళ్లు చంద్రబాబునాయుడికి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరువు పెట్టా రు.

వీటిపై ఆయన మాట్లాడుతూ ఎ స్సారెస్పీ నీటిని తక్షణమే విడుదల చే యాలని సీఎంను హెచ్చరించారు. తన హయాంలో ఎస్సారెస్పీ కాలువలను ఆధునీకీకరించి లైనింగ్ చేశానని 3 లక్ష ల ఆయకట్టును 9 లక్షల ఆయకట్టుకు పెంచానని చెప్పారు. ఆదరణ పథకం పెట్టి కులవృత్తులు చేసుకునే వారికి పనిముట్లు ఇప్పించానని అధికారంలోకి వ చ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తానని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు ఇస్తామన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్ర త్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. బీడీ కార్మికుల కు వెయ్యి బీడీలకు 150 రూపాయలు, నెలకు 1500 పెన్షన్ ఇ ప్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని అన్నారు.

వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్‌ను 600కు పెంచుతామని, వికలాంగులకు వెయ్యికి తగ్గకుం డా పర్సంటేజీ ప్రకారం ఇస్తామని, క రెంట్ చార్జీలు తగ్గించే ఆలోచన చేస్తున్నానని ఎరువుల ధరలు తగ్గించకుంటే సబ్సిడీ కల్పిస్తానని, రైతు రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. రాయికల్, అ ల్లీపూర్‌లో జరిగిన సభలకు జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో చంద్రబాబు ఉత్సాహంగా వరాలు గుప్పించారు. ప్ర జలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ యా వర్గాల ద్వారా తెలుసుకుని ఆయ న వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎల్ రమణ, సీహెచ్ విజయరమణారావు, సుద్దాల దేవ య్య, ఎమ్మెల్సీ నర్సారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, ని యోజకవర్గాల ఇన్‌చార్జీలు గండ్ర నళి ని, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, కర్రు నాగ య్య, గోపు అయిలయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు బోనాల రాజే శం, అన్నమనేని నర్సింగరావు, కళ్యాడ పు ఆగయ్య, గండ్ర రమాదేవి, పన్యాల శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, అమీనాబేగం, జవ్వాజి తిరుపతి, సింగిరి సాహితీ కుమారి, సం కు సుధాకర్, తెలుగు యువత అధ్యక్షు డు గౌతంకృష్ణ, ప్రధాన కార్యదర్శి విజయేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షు లు లక్ష్మినారాయణ ఉన్నారు.

మీ ఆరోగ్యం బాగుంటే..మేం బాగుంటాం..: సార్. నాకు ఫ్రీగా బుక్స్ కొనివ్వాలి. మాసార్లు చదువు బాగా చెబుతున్నా రు. పెన్నులు కొనివ్వాలి. మీ ఆరోగ్యం బాగుండాలి.. మీరు బాగుంటే మేం బా గుంటాం.. అని 6వ తరగతి చదువుతు న్న విద్యార్థి అజ్మత్ అన్న మాటలకు చంద్రబాబునాయుడు చలించిపోయా రు. ఆ మాటలకు కొన్ని క్షణాల వరకు మాటలురాలేదు. పిల్లలు మట్టిలో మా ణిక్యాలు బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. వారికి ఉచితంగా పుస్తకా లు, నోట్ బుక్కులు ఇప్పిస్తానని బాబు హామీ ఇచ్చారు.