December 18, 2012

బాబు పాదయాత్రలో జన జాతర

జగిత్యాల జనసాగరమయ్యింది. వీ ధులన్నీ కిక్కిరిసిపోయాయి. పాదయాత్రగా వస్తున్న చంద్రబాబుపై బంగాళా ల మీద నుంచి బంతి పూల వర్షం కురిపించారు. మహిళలు మంగళహారతు లు, బతుకమ్మలు. బోనాలతో.. దారి పొడవునా విద్యార్థులు పూలు చల్లు తూ.. కుల సంఘాలు తమ వృత్తులతో ఘన స్వాగతం పలికి చంద్రబాబును పు లకింప చేశారు. మీకు అండగా ఉ న్నాం.. ముందుకు సాగండి.. అంటూ ఆశీర్వదించారు. వస్తున్నా మీ కోసం పా దయాత్రలో భాగంగా మంగళవారం జగిత్యాల మండలం కండ్లపల్లి, జగిత్యా ల పట్టణంలోని హనుమాన్ వాడ, టవ ర్ సర్కిల్, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్ చౌరస్తా మీదుగా ధరూర్, రాజారం, నూకపల్లి శివారు వరకు 14 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర సాగింది.

కిష్టంపేట ధాటిన తర్వాత రాత్రి బస చేసిన చంద్రబాబు నాయుడు ధర్మపురి అసెం బ్లీ నియోజకవర్గ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాదయాత్రను సాగించారు. కొద్ది దూ రం చేరుకున్నాక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. మార్గమధ్యంలో డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు పడాల లక్ష్మినర్సు, లక్ష్మి మరికొందరిని బాబు పలకరించా రు. పావలా వడ్డీ రుణాల పేరిట ఎక్కు వ వడ్డీని వసూలు చేస్తున్నారు. కొంత మందికే రుణాలు ఇస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడం లేదని మీరైనా మమ్మల్ని ఆదుకోవాలన్నారు. డ్వాక్రా సంఘాలను నేనే పెట్టి మిమ్మల్ని చైతన్యపర్చానని మీ సమస్యలు తీరుస్తానని చంద్రబాబు చెప్పారు.

బోరు బావుల వద్ద ఉన్న రైతు లు రామిడి నర్సయ్య, మల్లయ్య వద్దకు రోడ్డు దిగి వెళ్లగా వారు సమస్యలను ఏకరువు పెట్టారు. వ్యవసాయానికి క రెంట్ సరిపడా రావడం లేదని.. పంట లు ఎండిపోతున్నాయని చెప్పారు. నాడు టీడీపీ హయాంలో 9 గంటల కరెంట్ ఇచ్చానని ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవన్నారు. అధికారంలోకి రాగానే 9 గంటల పాటు నా ణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కండ్లపల్లి గ్రామానికి చేరుకుని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయనకు డప్పుల చప్పుళ్లతో స్వాగతం పలికారు. గల్ఫ్ బాధితులు టెంట్ వేసుకుని కూర్చున్న చోటికి వెళ్లి వారి గాధలను విన్నారు.

వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. దీం తో చలించిపోయిన చంద్రబాబు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్‌కు పో యి అష్టకష్టాలు పడుతుంటే వారి గు రించి పట్టించుకోరని అన్నారు. ఏజెం ట్లు మోసాలు చేసినా వారిపై కఠిన చర్య లు తీసుకోవడం లేదన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక మం త్రిత్వ శాఖను ఏర్పాటు చేసి గల్ఫ్ నుం చి వచ్చిన వారికి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అక్కడున్న వారి యోగ, క్షేమాలు తెలుసుకుని తగి న చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి జగిత్యాల పట్టణానికి బయలుదేరిన చంద్రబాబుకు హనుమాన్ వాడలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, గుస్సాడీ నృత్యాలు, ఒగ్గు కళాకారుల డోలు నృత్యాలతో ఘ న స్వాగతం పలికారు.

అక్కడి నుంచి టవర్ సర్కిల్ మీదుగా బస్టాండ్ చౌర స్తా వరకు సాగింది. అడుగడుగునా ఆ యనకు జగిత్యాల పట్టణ ప్రజలు నీరాజనాలు పలికారు. కుల వృత్తుల వాళ్లు బ్యానర్లు కట్టి స్వాగతం పలకగా వారి వద్దకు వెళ్లిన చంద్రబాబు వారి సమస్య లు తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమా ల వేసి ముందుకు కదిలారు. చేనేత అం గడి బజారుకు వెళ్లి రాట్నం వడికాడు. చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వరాల జల్లులు కురిపించారు. 'నేను జగిత్యాలకు వచ్చినప్పుడు మీరు నన్ను మీ కుటుంబ స భ్యుడిగా నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు.

కాళ్ల నొప్పులు వచ్చి ఇబ్బందు లు పడుతున్నా.. మీ ఇబ్బందులు చూ శాక వాటిని మరచిపోయాను. 74 రో జులుగా మీకు అండగా, తోడుగా ఉం డాలని మీ కష్టాల్లో పాలు పంచుకోవాలని పాదయాత్ర చేస్తున్నాను' అని ప్ర సంగం ఆరంభించారు. కాంగ్రెస్ ప్రభు త్వపాలన తీరుపై నిప్పులు చెరిగిన ఆ యన సామాజాన్ని పట్టి పీడుస్తున్న అ వినీతిని పారద్రోలాలన్నారు. ఎఫ్‌డీఐల వల్ల దేశంలో 16 కోట్ల మంది బజారున పడే ప్రమాదముందన్నారు. ఇందుకు నేనేమి చేయాలి, మీరేమీ చేస్తారో అం టూ పలువురికి మైకు ఇచ్చి వారి సూచనలను స్వీకరించారు. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఆయన సకల జనుల సమ్మెలో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డి మాండ్ చేశారు.

బీసీలకు రాజ్యాధికారం కల్పించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు ఇస్తామని, మైనార్టీలకు 15 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

వస్త్రాలపై విధిస్తున్న వ్యాట్ పన్నును ఎత్తివేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేపడతానని, మాదిగలకు టుంబాల్లో పెద్ద మాదిగగా ఉంటానని అన్నారు. లీడ్‌క్యాప్ ద్వారా లెదర్ పార్క్‌ను ఏర్పాటు చేస్తానని అన్నారు. ఉద్యోగులకు త్వరలోనే ఒక పాలసీని ప్రకటిస్తానని, ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని, ఎస్సీలకు 10 వేల కోట్లతో, బీసీలకు 50 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తానని అన్నారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాఐ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, కోడెల శివప్రసాదరావు, బాబుమోహన్, ఎమ్మెల్యేలు ఎల్ రమణ, సీహెచ్ విజయరమణారావు, సుద్దాల దేవయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జీలు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, గోపు అయిలయ్య యాదవ్, డాక్టర్ రవీందర్‌రావు, గండ్ర నళిని రాష్ట్ర, జిల్లా నాయకులు బోనాల రాజేశం, అన్నమనేని నర్సింగరావు, కె ఆగయ్య, దామెర సత్యం, అంజలీ దేవి, జి తిరుపతి, గుం టి జగదీశ్వర్, కల్లెడ సత్యనారాయణ రావు, రాంచందర్ రావు, గట్టు సతీష్, బాల శంకర్, గుమ్మడి సత్యం, రవీందర్ రెడ్డి, వొల్లం మల్లేశం, దామోదర్ రావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు గౌతంకృష్ణ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మినారాయణ, కార్యకర్తలు, తదితరు లు పాల్గొన్నారు.