December 19, 2012

చంద్రబాబుకు ప్రజలు ముఖ్యంగా మహిళలు నీరాజనాలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తు న్నా ... మీకోసం' పాదయాత్ర లభిస్తు న్న స్పందన ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. తెలంగాణ ఉద్య మం నేపథ్యంలో మూడేళ్ళుగా టీడీపీ అనేక ఆటుపోట్లను చవిచూస్తున్న విష యం తెలిసిందే. పార్టీ కార్యకలాపాలు కూడా గణనీయంగా తగ్గుముఖం ప ట్టిన నేపథ్యంలో అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర కొత్త ఊపిరినిస్తోంది.

పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెడుతున్న తెలుగుదేశం పార్టీ నేతల కు జిల్లాలో లభిస్తున్న మద్దతు పార్టీ భవితవ్యంపై కొత్త ఆశలను చిగురింపజేస్తున్నది. పార్టీ ప్రాతినిధ్యం లేని కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన పా దయాత్రకు అడుగడుగునా చంద్రబాబుకు ప్రజలు ముఖ్యంగా మహిళలు నీరాజనాలు పట్టడం, జగిత్యాల పరిధిలోనూ అదే స్పందన లభిస్తుండటం శ్రేణులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. చంద్రబాబు పాదయాత్రకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చి ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. స్థానికంగా తా ము ఎదుర్కొంటున్న సమస్యలను చం ద్రబాబు దృష్టికి తీసుకువస్తూ 'మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయి...' అంటూ చె బుతుండ గా .. చంద్రబాబు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే ఆయా వర్గాల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తానని హామీలను కురిపించడం ద్వారా వారి ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా నిలిచిన కరీంనగర్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్రపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణవాదుల నుంచి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉం టుందని అనుమానించారు. ఇదే సమయంలో 28న అఖిలపక్ష సమావేశం ఖరారు కావడంతో టీడీపీపై మరింత ఒత్తిడి పెరుగుతుందని అందరూ భా వించారు. అయితే చంద్రబాబు మా త్రం జిల్లాలో ప్రసంగించినప్రతీ చోట తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, తెలంగాణను ఎన్నడూ వ్యతిరేకించలేదని, భవిష్యత్‌లో కూడా వ్యతిరేకించబోనని స్పష్టం చేస్తూ ప్రజలను ఆకర్షించడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదనే భావాన్ని ప్రజ ల్లో నాటడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం ఉన్నందున టీడీపీ ఆ స మావేశంలో అనుసరించనున్న విధానాన్ని జిల్లాలోనే ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే అందుకోసం పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేస్తారని, లేక ముఖ్య నేతలతో చర్చించి ఒక అభిప్రాయానికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ తీసుకోనున్ననిర్ణయమే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవితవ్యా న్ని నిర్ణయించేదిగా మారి కరీంనగర్ టీడీపీ చరిత్రలో కీలక జిల్లాగా మిగిలిపోతుందని భావిస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు తీసుకోనున్న నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆసక్తి అటు తెలుగుదేశం పార్టీలోనూ, ఇటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమవుతున్నది.

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చెబుతూనే కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు పన్నే పార్టీ అని, తెలుగుదేశం పార్టీని ఇబ్బందులపాలు చేయడానికే ఏదో ఒక ప్రాంతంలో దెబ్బతీయాలనే ఆలోచనతో ఆ పార్టీ వ్యూహరచన చేస్తున్నదని, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవల్సిన అవసరం తనపై ఉన్నదని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని టీడీపీ అధినేత తన ప్రసంగాల్లో చెబుతుండటంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కొందరు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో త మ పార్టీకి దెబ్బ తగులుతుందని చెప్పడమేనని ఆయన తెలంగాణపై కర్ర విరగకుండా పాము చావకుండా అభిప్రాయం చెబుతారని భాష్యం చెబుతుండగా ... తెలుగుదేశం పార్టీ శ్రేణు లు మాత్రం తెలంగాణకు తాను వ్యతిరేకం కాదనిప్రసంగాల్లో ప్రకటిస్తున్న మాదిరిగానే అదే అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో చెబితే తెలంగాణలో తమ పార్టీ బలమైన పార్టీగా మిగిలిపోయి గత వైభవాన్ని పొందవచ్చని ఆశిస్తున్నాయి. ఏదేమైనా ... చంద్రబాబునాయుడు తెలంగాణపై ఏ నిర్ణ యం తీసుకుంటారన్న దానిపైనే ఇప్పు డు జిల్లాలో ప్రధాన చర్చనీయాంశం గా మారింది. జిల్లాలో ఇప్పటికే నా లుగు రోజుల పాదయాత్ర పూర్తి కాగా మరో పది రోజుల పాటు పాదయాత్ర సాగనున్నది. జమ్మికుంటలో పత్తిరైతు ల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబునాయుడు దీక్ష చేస్తారని ప్రకటించడంతో అందుకోసం కూడా ఒక పూట కేటాయించే అవకాశం ఉన్నది.