December 19, 2012

నేటితో బాబు పాదయాత్రకు 75 రోజులు...

జగిత్యాల : టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడు చేపట్టిన పాదయాత్ర నే టికి 75 రోజులకు చేరనున్నది. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకో సం పాదయాత్రను అనంతపూర్ జిల్లా హిందూపూర్ సమీపంలోని సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూ జలు చేసి ప్రారంభించారు. ఇప్పటివర కు ఆయన అనంతపూర్, కర్నూలు, మ హబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ని జామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను పూర్తి చేసుకుని కరీంనగర్ జిల్లాలో ప ర్యటిస్తున్నారు. బాబు పాదయాత్ర మొ దలు పెట్టిన నాటి నుంచి మధ్యలో 4 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకోగా, నేటికి 75 రోజులకు చేరుకుంది.

అక్టోబ ర్ 2న మొదలైన పాదయాత్ర 24 రోజులపాటు సజావుగా సాగగా, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో అక్టోబర్ 26న వేదిక కూలడంతో బాబు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అక్టోబర్ 26, 27 రెండు రోజులపాటు పాదయాత్ర జ రుగలేదు. అయితే 27న సాయంత్రం కొంత దూరం మాత్రమే నడిచి ముగించేశారు. ఆ తర్వాత నవంబర్ 2న టీడీ పీ అధినేత ఎర్రంన్నాయుడు మరణించడంతో హుటాహుటిన పాదయాత్రను ముగించుకుని శ్రీకాకుళం వెళ్లిపోయా రు.

దీంతో బాబు పాదయాత్ర మొత్తం రోజుల్లో 4 రోజులు జరుగకపోగా, నేటి కి 75రోజులకు చేరుకుంది. అక్టోబర్ 2న ప్రారంభమైన పాదయాత్ర ఆ నెలలో 28 రోజులపాటు సాగగా, నవంబర్‌లో 2 రోజులు జరుగకపోగా 28 రోజులపాటే సాగింది. డిసెంబర్ నెలలో 19వ రోజుకు నేడు చేరుకుంది. దీంతో మొ త్తం బాబు పాదయాత్ర 75 రోజులుగా చేరుకున్నట్లైంది.

చంద్రబాబు పాదయాత్ర మంగళవారంతో మొత్తం 74రోజులలో 1,249.07 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు.