December 19, 2012

గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

జగిత్యాల/జగిత్యాల రూరల్ : ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. అసమర్థ ప్రభుత్వం...అవగాహన లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.. బాధితుల క ష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.. పొట్టకూటి కోసం లక్షలాది రూపాయలు అప్పులుచేసి గల్ఫ్ వెళ్తే అక్కడే కుటుంబ పెద్ద చనిపోవటం తో భార్యాపిల్లలు కడసారి చూపుకు కూడా నోచుకోలేక పోతున్నారు. కనీ సం శవాన్ని కూడా తెప్పించలేకపోతున్నారు. ప్రజల కష్టాలు తీర్చడం లో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అ న్నారు.

వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా మంగళవారం జగిత్యాల మండలంలోని కండ్లపెల్లి లో గల్ఫ్ బాధితులతో ఆయన ద ర్బార్ నిర్వహించారు. ఈ సందర్భం గా గల్ఫ్ బాధితులు తాము పడుతు న్న ఇబ్బందులను వివరించారు. అ నంతరం చంద్రబాబు మాట్లాడు తూ గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్ లేదనడం సి గ్గుచేటన్నారు. బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను. ప్ర భుత్వం సహాయక చర్యలు చేపట్టాల్సిందిపోయి తప్పించుకునే ప్రయ త్నం చేస్తోంది. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మీకు అండగా ఉం డి పోరాటం చేస్తామన్నారు. కేరళ ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, తాము అధికారంలోకి వస్తే అదే తరహాలో కేరళకు తమ ఎమ్మెల్యేను పంపి స్టడీ చేయించి ఆదుకుంటామన్నారు. ఏజెంట్ల మోసాల వల్ల విజిటింగ్ వీసాలపై వెళ్లి మనవారు ఇబ్బందులు పడుతున్నారని, అక్క డి ప్రభుత్వం ఇప్పుడు వెళ్లిపోవాలని ప్రకటించడంతో దేశంలోని 45 వేల మంది గల్ఫ్ బాధితులు బయటప డ్డారని, అందులో మన రాష్ట్రానికి చెందినవారే 18 వేల మంది మన తె లుగువారు ఉన్నారన్నారు.

ఇది అసమర్థ ప్రభుత్వమని, మానవత్వం లే దని, వీరి కష్టాలు చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసాలు చేసి ఏజెంట్లు వీసాలు అ ప్పగిస్తే అవగాహన లేక వెళ్లినవారు ఇబ్బందులు పడుతున్నారు. ఒక క రీంనగర్ జిల్లా నుంచే 10లక్షల మం ది గల్ఫ్ వెళ్లారని అన్నారు. 2007 లో అక్కడి ప్రభుత్వం వెళ్లగొట్టడం తో చాలా మంది తిరిగి రాగా ఇప్పటివరకు 1200 మంది ఆత్మహత్య లు చేసుకున్నారని అన్నారు. 2007 లో 10 వేల మందికి టిక్కెట్లు ఇచ్చి ఇంటికి తెస్తామని ప్రకటించి 1200 మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

మల్యాల మండలం బోగ గంగాధర్ సౌదీలో చనిపోయాడని, ఆయ న తండ్రి కూడా ఇక్కడ చనిపోయాడని, శవాన్ని తెప్పించకపోవటంతో వెబ్ కెమెరాలో చూడాల్సిన దుస్థితి ఉందని, కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నారని అన్నారు.

కొత్తకొండ బుచ్చయ్య 12 సంవత్సరాలుగా జై లులో మగ్గుతున్నాడని, ఇలా గల్ఫ్ కష్టాలు చెప్పనలవి కాదు. అందుకే తాము అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. విజిటింగ్ వీసాలతో మోసాలు చేస్తున్నవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక జీఓ తీసుకువచ్చి చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. గతంలో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో బృందం కేరళ వెళ్లి వచ్చిందని, 2007లో నిరుపేదలైన బాధితులను గుర్తించి 100 మందికి ఉచితంగా టిక్కెట్లు అందించామని గుర్తు చేశారు.

బాధితుల కంటతడి..

గల్ఫ్ బాధితుల సమావేశంలో ప లువురు బాధితులు పాల్గొని కంటత డి పెట్టుకున్నారు. అక్కడికి వచ్చినవారంతా బాధితులు చెబుతున్న గో డును విని చిన్నబోయారు. కొంద రు ఆదుకోవాలని వేడుకుంటే.. ఇం కొందరు మేము బతకడమెట్లా అం టూ విలపించారు.