September 7, 2013

రైతుల జోలికొస్తే ఖబడ్దార్

 పంట రుణాలు చెల్లించమంటూ బ్యాంకు అధికారులు చేస్తోన్న ఒత్తిళ్లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రైతుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడితే మిమ్మల్ని వదిలి పెట్టనంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అప్పులు చెల్లించక పోతే మీరు వేలం వేస్తారా? ఎంత ధైర్యం మీకు. కాంగ్రెస్ దొంగలను వే లం వేస్తే దేశంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయన్నారు. రైతుల జోలికొస్తే ఖబడ్దార్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చా రు. గురువారం ఉదయం మోతడకలో ని చలపతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద నుంచి చంద్రబాబు ఐదో రోజు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. నిడుముక్కల, పొన్నెకల్లు, బేజాతపురం, రావెల, మందపాడు, బండారుపల్లి, గరికపాడు, తాడికొండ, కంతేరులో యాత్ర కొనసాగించారు. పలుచో ట్ల ఎన్‌టీఆర్ విగ్రహాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. మార్గమధ్యలో విద్యార్థులతో సంభాషించి వారికి భరోసా నింపారు. నిడుముక్కల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నిడుముక్కల, పొన్నెకల్లు, రావెల, తాడికొండలో జరిగిన ఆత్మగౌరవ యా త్రకు వేలాదిమంది ప్రజలు హాజరై చంద్రబాబుకు ఘనస్వాగతం పలికా రు. జన స్పందన చూస్తూ 'నేను ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. సంఘీభావం తెలుపుతున్నారు. టీడీపీపై ఉన్న అభిమానం, నా మద ఉన్న నమ్మకం మిమ్మల్ని ఆత్మగౌరవ యాత్రలో పాల్గొనేలా చేస్తోంది. మీ రు ణం తీర్చుకోలేనిదంటూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ వ సూళ్ల పార్టీ అని, మొద్దబ్బాయి రాహుల్‌కు ప్రధానమంత్రి, దొంగబ్బాయి జగన్‌కు సీఎం పదవి కావాలి. ఇటలీ సోనియా, ఇడుపులపాయ విజయలక్ష్మి లంకె కుదుర్చుకొన్నారు. ప్రధాని దేశా న్ని తగలబెట్టేస్తున్నారు. సోనియా డ బ్బు పిచ్చతో దేశంలో ఉన్న డబ్బు అం తా దోచేస్తోందంటూ మండిపడ్డారు.
నిత్యవసర సరుకుల ధరలు, రైతుల సమస్యల పైనా చంద్రబాబు చర్చించా రు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే రైతులకు రుణమాఫీ చేసి తీరుతుందని పునరుద్ఘాటించారు. వ్యవసా యం కోసం బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని విడిపిస్తుందన్నారు. చేతకాని ప్రధానమంత్రి బంగారం కొనొద్ద ని చెబుతున్నారు. ఇంకోపక్క పెట్రోలు బంకులు రాత్రి వేళ మూసేస్తామంటున్నారు. ఇదో తుగ్లక్ పరిపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొన్నెకల్లులో చంద్రబాబు కాన్వా య్ ప్రధాన మార్గంలో ఏర్పాటు చేశా రు. అయితే గ్రామస్థులు పట్టుబట్టి త మ వీధుల్లో నుంచి వెళ్ళాలని అడ్డుపడ్డా రు. ఆ సమయంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య కొంత వివాదం తలెత్తగా చంద్రబాబు జోక్యం చేసుకొని ఎవరూ ఆవేశ పడొద్దని చెప్పారు. తాను ప్రసం గం అయిపోగానే మీరు కోరిన మార్గంలోకి వస్తానని చెప్పి శాంతింప చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అలానే వారు కోరిన వీధిలో పర్యటించారు. మోతడకలో ఒక మహిళ చంద్రబాబుతో సంభాషిస్తూ తన భర్త చనిపోయినా అమ్మాయిని చదివించానని చెప్పారు. ఈ రోజున ఉద్యోగం రాకపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ ఏమి చేస్తామమ్మా ఈ కాంగ్రెస్ దొంగలు రా ్రష్టాన్ని దోచేశారు. దాంతో ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరూ ముం దుకు రావడం లేదు. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీలాంటి పేదవాళ్లందరికి న్యాయం చేస్తుందని ధైర్యం చెప్పారు.
నా కళ్ల ముందే హైదరాబాద్ సర్వనాశనం చేస్తున్నారు
గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని తాడికొండ నియోజకవర్గం మోతడకలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుభవాలను పంచుకొన్నారు. సీఎంగా ఉ న్న తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికి పడిన శ్రమను పూసగుచ్చినట్లు వి వరించారు. బిల్‌గేట్స్‌ను ఏ విధంగా ఒప్పించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్టు సెంటర్‌ను పెట్టించింది. తద్వారా ఇత ర కంపెనీలు కూడా వచ్చేలా చేసి హైటెక్ సిటీని నిర్మాణం చేసిన తీరును వెల్లడించారు. అలాంటి హైదరాబాద్‌ను నా కళ్ల ముందే నాశనం చేసేస్తున్నారంటూ చంద్రబాబు ఒకింత ఆవేదన చెందారు.
చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో బస చేసిన చంద్రబాబుకు గురువారం ఉదయం విద్యార్థులు ఘనంగా స్వాగ తం పలికారు. చంద్రబాబు ఇంచుమిం చు గంట సమయానికి పైగా తన అనుభవాలను విద్యార్థులతో పంచుకొన్నా రు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభించగానే విద్యార్థులు కేరింతలు కొట్టడంతో... తమ్ముళ్లూ విద్యార్థి వయస్సులో మీకంటే ఎక్కువ అల్లరి చేసేవాడిని నేను. నేను స్టూడెంట్ లీడర్‌ను. అ క్కడి నుంచే రాజకీయాల్లోకి వచ్చానని తన కళాశాల రోజులను గుర్తు చేసుకొన్నారు. డిగ్రీ చదువుకొనే దశలోనే ఎవరికైనా నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. అందుకే నేడు ఎంటెక్ చదివినా అందరూ ఎంబీఏ చదువుతున్నారు. దానికి కారణం నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికేనన్నారు. అందుకే తాను ఐఎస్‌బీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించానని చెప్పారు.
తల్లి, తండ్రి తర్వాత విద్యార్థుల జీవితాన్ని మలిచేది గురువులేనని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్రిటీష్ పాలన నుంచి దేశం బయటపడిన తర్వాత ఆర్థిక విధానాల్లో లోపం వలన అభివృ ద్ధి తక్కువగా జరిగింది. ఫారెన్ ఎక్స్ఛే ంజ్ లేక విధి లేని పరిస్థితుల్లో 1991వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడితే నేను పకడ్బందీగా అమలు చేశాను.
ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ రోజున మీరు పుట్టి ఉండరు. ఎవరైనా సరే చరిత్ర తెలుసుకొని భవిష్యత్తుపై దృష్టి సారిస్తేనే ముం దుకు వెళ్లగలరని నమ్ముతున్నానన్నా రు. 22 ఏళ్ల సంస్కరణల అమలులో ఫలితాలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. నేను సీఎం అయిన వెంటనే ఏమిటి మన దేశం? ఎందుకని ఇతర దేశాలతో పాటు ముందుకు వెళ్ళడం లేదని ఆలోచన చేశాను. నాకు ఆ రోజు, ఈ రోజు యువత స్ఫూర్తి. వారికి నాణ్యమైన విద్యనందిస్తే ప్రపంచాన్ని శాసిస్తారని గుర్తించి విద్యకు ప్రాధాన్యం ఇచ్చానన్నారు. పాఠశాలలు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్థాపించి అందరూ చదువుకొనేలా చేశాను. ఆ తర్వాత విజన్ 2020 ప్రారంభించాను. దానిని నేడు ఈ కాంగ్రెస్ దొంగలు విజన్ 420గా చేశారన్నారు.
అమెరికా, యూరప్, చైనాలో యువతకు కొరత ఉన్నది. మనవాళ్లు మాత్రం ప్రపంచంలో పని చేసే ప్రతీ నలుగురిలో ఒకరున్నారు. అందునా తెలుగువారుండాలని ఆలోచన చేశాను. చదువుకొన్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల గురించి ఆలోచించి అప్పుడే వస్తోన్న ఐటీ విప్లవాన్ని గుర్తించాను. ఇంజనీరింగ్ కళాశాలల అనుమతి కోసం ఢిల్లీ చుట్టూత ఫైళ్లు పట్టుకొని తిరిగాను. నా స్వంత పనికి కూడా అంతగా కష్టపడలేదని చెప్పారు. అమెరికాకు ఒక బృందాన్ని పంపించి అక్కడ విద్యా విధానాన్ని అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు సంస్కరణలు తీసుకొచ్చాను.
ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, తాడికొండ ఇన్‌చార్జ్ తెనాలి శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, జీ వీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, కందకూరి వీరయ్య, అనగాని సత్యప్రసాద్, ఎస్ ఎం జియావుద్దీన్, యాగంటి దుర్గారావు, కోవెలమూడి రవీంద్ర, పెదకూరపాడు బుజ్జి, వెన్నా సాంబశివారెడ్డి, మన్నవ సుబ్బారావు, కొర్రపాటి నాగేశ్వరరావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, ముత్తినేని రాజేష్, వట్టికూటి హర్షవర్ధన్, కట్టా శ్రీను, సిరిపురం శ్రీధర్, కసుకుర్తి హన్మంతరావు, గుడిమెట్ల దయారత్నం, సగ్గెల రూబెన్ తదితరులు పాల్గొన్నారు.