April 15, 2013

రాష్టాన్ని పాలించే హక్కు కాంగ్రెస్‌కు లేదు

దత్తిరాజేరు : కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే హక్కులేదని గజపతినగరం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు కరణం శివరామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని మరడాంలో విద్యుత్ ధరలు, కోతలపై సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కన్నా తుగ్లక్ పాలన మిన్నా అని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూ డా ధరలు పెంచలేదన్నారు. అత్యంత దారుణంగా విద్యుత్ ధరలు పెంచి విద్యుత్ సంక్షోభానికి కారణం అయ్యారని, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలోకి వెళ్తుందన్నారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు తెలుగుదేశం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులను జైలుకు పంపే రోజులు వస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. సంతకాల సేకరణకు ప్రజల నుంచి మంచి మద్ద త వస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందన్నారు. ప్రభు త్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ కంది తిరుపతినాయుడు, మం డల పార్టీ అధ్యక్షుడు గంటా త్రినాధరావు, నాయకులు తాడి సాంబమూర్తి, రాగోలు బంగారి, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.