April 15, 2013

ఎక్కడికక్కడే టీడీపీ నేతల అరెస్టులు

అనంతపురం అర్బన్: జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీస్తామని ప్రకటించిన నేపథ్యంతో ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశా రు. సీఎం సభకు వెళ్లనీయకుండా అ డ్డుకున్నారు. ముందస్తు చర్యల్లో భా గంగా ఉదయమే ఆయా నేతల ఇళ్లవద్దకు వెళ్లి హౌస్అరెస్టు చేశారు. మరికొందరు సీఎం సభకు వెళ్తుండగా... మార్గమధ్యలో అడ్డుకుని, అరెస్టు చే శారు. జిల్లాకేంద్రంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మె ల్సీ శమంతకమణి, జిల్లా ప్రధాన కా ర్యదర్శి వరదాపురం సూరి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ సీఎం సభకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.

దీన్ని తెలుసుకున్న సీఐలు శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, మహబూబ్‌బాషా సిబ్బందితో బీకే పార్థసారధి ఇంటివద్దకెళ్లి హౌస్ అరెస్టు చేశారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు బీవీ వెంకట్రాముడు, నెట్టెం వెంకటేష్, కందిగోపుల మురళి, రాప్తాడు వెంకట్రాముడు, మ రూరు గోపాల్, సీపీఐ నాయకులు కేశవరెడ్డి, రాజారెడ్డి, మల్లికార్జున అక్కడి కి చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి సీఎం సభకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో వారిని అరె స్టు చేసి టూటౌన్ స్టేషన్‌కు తీసుకెళ్లి, మధ్యాహ్నం వదిలారు. ఈ అరెస్టులపై టీడీపీ, సీపీఐ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు.

ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను సీ ఎం దృష్టికి తీసుకెళ్లడానికి వెళ్తుంటే పోలీసులు ఇళ్లవద్దకే వచ్చి అరెస్టు చే యడం దారుణమన్నారు. బీకే పార్థసారధి మాట్లాడుతూ... ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి పాలకులకు ప్రజ లే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... జిల్లా రైతాంగం, తా గు, సాగునీటి సమస్యలను సీఎం దృ ష్టికి తీసుకెళ్లడానికి వెళ్తుంటే పోలీసుల ద్వారా అరెస్టులు చేయించడం దారుణమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ... గృహనిర్బం ధం చేసి అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. అరెస్టుల ద్వారా విపక్షాల గొంతు నొక్కారని ధ్వజమెత్తారు.

వీటి తో ఉద్యమాలను అణచలేరని హెచ్చరించారు. దమ్ము, ధైర్యం ఉంటే సీబీ ఐ కేసులో ఉన్న అవినీతి, 420 మం త్రులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం, మంత్రులకు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడు తూ... పాలకులు ఇలాగే వ్యవహరిస్తే ఇందిరమ్మ కలలు కలలుగామానే మారిపోతాయని హితబోధ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి మాట్లాడుతూ... ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే పాలకులు స్వార్థంకోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పాలకులకు అనంత జనం ఉసురు తగలకమానదని శపించారు.