October 11, 2012

తొమ్మిదో రోజు పాదయాత్ర బెళుగుప్ప మండలం (10.10.2012)

అలుపెరుగని బాటసారి
9 రోజులు.. 165 కిలోమీటర్లు
అడుగడుగునా పూలవర్షం.. మంగళ హారతులు

  'మీ కష్టాల్లో భాగం పంచుకోవడానికే వచ్చాను. మీకు న్యా యం చేయడానికి పాదయాత్ర చేపట్టాను. నన్ను ఆశీర్వదించండి. మీ కష్టాలు తీర్చే శక్తి నాకు ప్రసాదించండి' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర పదో రోజులోకి అడుగుపెడుతోం ది.

ఆయన ఇప్పటివరకు 165 కిలోమీటర్లు నడిచారు. ఆరుపదులు దాటిన వయసులోనూ ఏమాత్రం అలసట లేకుండా ముందుకు సాగుతున్నారు. దారి పొడవునా విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు చూపుతున్న అభిమానం బాబులో నూతనోత్సాహాన్ని నింపుతోంది.

రోజూ కనీసం 200మందితో మాట్లాడుతున్నారు. దాదా పు 84 గ్రామాల్లో పర్యటించారు. తొమ్మిదో రోజు యాత్ర బుధవారం బెళుగుప్ప మండలం విరుపాపల్లి వద్ద మొద లై.. రాత్రి 11 గంటలకు హనకనహల్‌కు చేరుకుంది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తోపాటు జనం భారీ గా యాత్రలో పాల్గొన్నారు.

పలుచోట్ల ప్రజలుబాబుపై పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పాదయాత్రకు ఎర్రిస్వామి అనే రైతు తనవంతు సాయంగా రూ. 5వేలు అందించా రు. విరుపాపల్లి, శీర్పి గ్రామాల మధ్య బాబు పొలాల్లో కలియదిరిగారు. ఓ రైతు పొలంలో కాలిపోయిన మోటారును చూసి విద్యుత్ కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   (source:andhrajyothy)
No comments :

No comments :