February 20, 2013

బాబుకు నీరాజనాలు

జిల్లాలో 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర కొనసాగిస్తోన్న చంద్రబాబుకు వాడవాడలా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారా వు చెప్పారు. మంగళవారం ఉద యం వేమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళలు స్వచ్చంధంగా ముందుకొచ్చి మా కష్టాలు తీరాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని గట్టిగా విశ్వసిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు బలహీనవర్గాలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకొంటూ వాటి పరిష్కారమార్గాలను ఆలోచిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఆయన మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తిగా విశ్రాంతి శిబిరానికి పరిమితమౌతారని చెప్పా రు. ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా చంద్రబాబు ఈసీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తున్నారని వెల్లడించారు. త్వరలో జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందన్నారు. జిల్లాలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ టీడీపీనే అని ఒకవేళ కాంగ్రెస్, వైసీపీ లోపాయికారి ఒప్పందం చేస ుకొంటే ప్రజలే వాటిని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.

ప్రజల్లోకి సునామిలా వెళుతోన్న పాదయాత్ర మాజీ మంత్రి డాక్టర్ 'కోడెల' చంద్రబాబు కొనసాగిస్తోన్న పా దయాత్రకు రోజురోజుకు జనాదరణ విపరీతంగా పెరుగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మం త్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం సాయం త్రం ఆయన వేమూరులో చంద్రబాబు బస చేసిన శిబిరం వద్ద విలేకరులతో మాట్లాడుతూ పాదయాత్ర ఒక సునామిలా ప్రజల్లోకి చొచ్చుకొని పోతోందన్నారు. టీడీపీ హ యాంలో ఏమి పనులు జరిగాయి, పరిపాలన ఎలా నడిచింది, ఇప్పుటి పరిస్థితి ఏమిటి అనేది ప్రజలు చర్చించుకొంటున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం పేదల కోసం కాదు పెద్దల కోసమేనని గట్టిగా నమ్ముతున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిం ది చంద్రబాబేనన్న విషయాన్ని కూడా విశ్వసిస్తూ స్వా గతం పలుకుతున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ, బెల్టుషాపుల తొలగింపు, ఎన్‌టీఆర్ సుజలకాంతి పథకం తో ఇంటింటికి కృష్ణాజలాల తాగునీరు హామీలు అమ లు చేసి తీరుతామని స్పష్టం కోడెల స్పష్టం చేశారు.