June 13, 2013

ధరల పెరుగుదలకు ప్రభుత్వాలేకారణం : చంద్రబాబు

హైదరాబాద్‌ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని టీడీపీ సుప్రీం చంద్రబాబునాయుడు విమర్శించారు. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాల ప్రారంభాని ముందు గన్‌పార్క్‌ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పి, అధికారంలోకి వచ్చిన అనంతరం ధరలను విపరీతంగా పెంచిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర ధరలు 300 నుంచి 400 శాతం పెరిగాయన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని చెప్పారు. స్పీకర్‌ వ్యవహార శైలి బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ నేతలు గన్‌పార్క్‌ వద్ద వంటావార్పు నిర్వహించారు.