October 19, 2012

ఆరోగ్యశ్రీ స్థానంలో మెరుగైన వైద్య పథకం 18వ రోజు వస్తున్నా మీకోసం యాత్రలో..19.10.12

ఆరోగ్యశ్రీ స్థానంలో మెరుగైన వైద్య పథకం
వికలాంగులకు పెద్దపీట
ఆ శాఖకు చైర్మన్, కార్యదర్శి వారే
అవమానాలపై ప్రత్యేక చట్టం

  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం కంటే మెరుగైన సమగ్ర ఆరోగ్య వైద్య పథకాన్ని ప్రవేశపెడుతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరోగ్యశ్రీలో కొన్ని రకాల జబ్బులకే వైద్యం అందుతోందని, అలా కాకుండా తాను తన మదిలో ఉన్న పథకానికి ఎక్కువ రోగాలకు వర్తించేలా రూపొందిస్తామని అన్నారు. దీంతో డెంగ్యూ లాంటి విష జ్వరాలకు కూడా ఆ పథకం వర్తింస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వికలాంగులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వస్తున్నా మీకోసం యాత్రలో 18వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కాలినడక సాగించారు. ఈ సందర్భంగా తమ కష్టాలు చెప్పుకున్న వికలాంగులను నుద్దేశించి దారిలో చంద్రబాబు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ. వెయ్యి కోట్లతో బడ్జెట్ చేస్తామన్నారు. ఆ శాఖకు చైర్మన్, కార్యదర్శులు ఆ వర్గం నుంచే ఉంటారన్నారు. వికలాంగులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని చెప్పారు. బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నారు. వికలాంగులను ఏ రకంగా అవమానించినా ప్రత్యేక చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామన్నారు. తమ హయాంలో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు లబ్ధి చేకూరుస్తానన్నారు. తాను అధికారంలోకి వస్తే ఆ వర్గానికి మరింత మేలు చేసి పెద్ద మాదిగను అనిపించుకుంటానన్నారు. వికలాంగులకు సంబంధించిన లక్షా 60వేలు పింఛన్‌లను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితంలో అంధకారం నింపిందన్నారు. ప్రభుత్వ విధానాలతో చాలా మంది వికలాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరు సలహాలు ఇవ్వండి.. నేనేమి చేయాలో అడగండి..
మీ వద్దకు వస్తున్నా.. మీతో మాట్లాడుతున్నా.. మీ కష్టాలు తెలుసుకుంటున్నా.. ఈ సమయంలో నేను మీ కోసం ఏమి చేయాలో చెప్పండి.. మీరు నాకు సలీహాలు ఇవ్వండి.. నిండు మనసుతో ఆశీర్వదించండి.. నన్ను అర్థం చేసుకోండి.. మీ కుటుంబంలో పెద్ద కొడుకుగా ఆదరిస్తే మీకు అండగా ఉంటా.. అంటూ చంద్రబాబు ప్రజలతో మాట్లాడుతున్న ప్రతిసారి అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పెడుతున్న కష్టాలతో అప్పులు లేని వారు లేకుండా పోయారు.

కాంగ్రెస్ దోమలతో జబ్బులు..
రాష్ట్రంలో అవినీతికి మారుపేరు అయిన కాంగ్రెస్ నేతల మాదిరే కాంగ్రెస్ దోమలు కుట్టి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని అన్నారు. కరెంట్ కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయన్నారు. భార్యభర్తల్లో ఒకరు పొలం వద్ద, కాలువ వద్ద ఉంటూ మరొకరు మోటారు వద్ద కనిపెట్టుకున్నా చేనులోకి నీళ్లు సాగడం కష్టంగా ఉందన్నారు. 67 ఏళ్ల స్వాసంత్య్రం అనంతరం కూడా ఆడ బిడ్డలు కష్టాలు పడుతున్నారన్నారు. జరిగిన అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీ హయాంలోనేనన్నారు. పొదుపు సంఘాల ఏర్పాటు, వెలుగు, దీపం, రివాల్వింగ్ ఫండ్, మధ్యాహ్న భోజన పథకం వంటివి తామే ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి పేరుతో నిధులు కాజేస్తూ పంట నష్టపరిహారం కూడా తినేస్తున్నారన్నారు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిన జనం.. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అప్పట్లో నీరాజనం పలికారన్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు తోడుగా రాష్ట్ర నాయకులు.. మూడు రోజులుగా కాళ్ల నొప్పితో బాధ పడుతూ ముందుకు సాగుతున్న చంద్రబాబును పరామర్శించేందుకు టీడీపీ రాష్ట్ర నాయకులు పలువురు ఆయనతో పాటు కాలినడక సాగించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు దాడి వీరభద్రరావు, ఎర్రబల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, మాజీ మంత్రి కళావెంకట్రావు, దేవరకడ్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి దంపతులు, రాష్ట్ర నాయకులు రావుల చంద్రశేఖర్, పి.రాములు, చంద్రశేఖర్, ఎల్లారెడ్డి, రమారాథోడ్, మాజీ ఎంపీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు, వరంగల్ జిల్లాల నుంచి 10 బస్సులు
చంద్రబాబు పాదయాత్రకు చిత్తూరు, వరంగల్ జిల్లాల నుంచి 10 బస్సుల్లో నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చారు. చిత్తూరు జిల్లా నుంచి ఇన్‌చార్జి జేఎంసీ శ్రీనివాసులు, దొరబాబు, కటారి మోహన్, పులవర్తి నాని, ఎస్సీ సెల్ నాయకులు గిరిధర్‌కుమార్, లివిస్‌తో పాటు 6 బస్సుల్లో 400 మంది తరిలారు. వరంగల్ జిల్లా నుంచి 4 బస్సుల్లో 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే ఎల్లారెడ్డితో పాటు 50 మంది కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.



chandrababu vastunna meekosam padayatra at kurnool dist

No comments :

No comments :