March 15, 2013

ఇక సమస్యలపై ఆందోళనలు: తలసాని

హైదరాబాద్‌సిటీ : నగరంలో ప్రజా సమస్యల పై తెలుగుదేశం పార్టీ భారీ ఆందోళనా కార్య క్రమాలుచేపట్టడానికి సిద్ధమవుతోంది. ఈమేరకు బుధవారం పార్టీకార్యాలయంలో జరిగిన నూతన కమిటీ తొలి కార్యవర్గసమావేశానికి గ్రేటర్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతోపాటు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విషయాలపై కూడా చర్చ జరిగింది. అనంతరం తలసాని శ్రీనివాస్‌యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు అధికంగా విద్యుత్, మంచినీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈనెల 23న విద్యుత్‌సమస్యల పై ర్యాలీపాటు విద్యుత్‌సౌథ ముట్టడి ఉంటుందని అన్నారు. ఈ మేరకు దాదాపు వెయ్యి ల్యాంతర్లలో ర్యాలీ ఉంటుందని అన్నారు.

ఇక మంచినీటి సమస్యలను నివారించాలని కోరుతూ త్వరలోనే ర్యాలీలు,ధర్నాలుకూడా చేపడతామని అన్నారు. ఇక పార్టీ ఆవిర్భావం దినోత్సవం కూడా ఈనెల 29వ తేదీన జరుగుతుందని అన్నారు. ఈసందర్భంగా నగరంలో వివిధ సేవా కార్య క్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ ప్రధానకార్యదర్శి ఎమ్మెన్ శ్రీనివాస్, వనం రమేష్, ఉపాధ్యక్షుడు డీపీరెడ్డి, జి.పవన్‌కుమార్‌గౌడ్, పరశురామ్‌ముదిరాజ్, అధికార ప్రతిని«ధులు బద్రీనాథ్‌యాదవ్, ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్, కిషోర్, ప్రచారకార్యదర్శి ప్రేమ్‌కుమార్‌ధూత్, కట్టారాములు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాబాజ్‌ఖాన్, బీసీసెల్ అధ్యక్షుడు తొలపునూరి కృష్ణాగౌడ్ సీనియర్‌నాయకులు జీఎస్‌బుగ్గారావు పాల్గొన్నారు.