March 20, 2013

పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించారు

నిడదవోలు: జిల్లా వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీలో కాంగ్రెస్, టీడీపీల నుం చి వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారని ఆ పార్టీకి చెందిన పలువు రు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. బుధవారం స్థానికంగా ఆ పార్టీ సమావేశం జక్కంశెట్టి బ్రదర్స్ అధ్యక్షతన జరిగింది. పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అధిష్ఠానం ప్రకటించిన నియోజకవర్గ సమన్వయ కర్తల నియామకాల్లో సామాజిక న్యా యాన్ని తుంగలో తొక్కారని ధ్వజ మెత్తారు. ఈ విషయమై పార్టీ అధినేత ను నేరుగా కలసి వివరిస్తామన్నారు.

జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేద, మ«ధ్య తరగతి వారికి అవకాశం లేకుం డా పోయిందని ఆవేదన చెందారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి ఖాదర్, నర్సాపురం నియోజక వర్గానికి చెందిన మైలా వీర్రాజు, ఏలూరు నగర మాజీ కన్వీనర్ బొద్దా ని శ్రీనివాస్, ఆచంటకు చెందిన వైట్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎస్‌సి సెల్ సభ్యుడు ముప్పిడి విజయారావు తదితరులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభావా లకు అనుగుణంగా పార్టీని నడిపించే వ్యక్తులకు సమన్వయకర్తల బాధ్యత ను అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తణుకు నియోజకవర్గానికి చెందిన విడివాడ రామచంద్రరావు మాట్లాడు తూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమ న్నారు. ఈ నెల 23న ఏలూరులో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ అసం తృప్త నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమవేశాన్ని నిర్వహిం చి సమావేశ తీర్మానాలను అధినేత జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళతామన్నారు. కార్యక్రమంలో జక్కంశెట్టి రాకేష్, లాకేష్, ప్రసాద రాజు, గోపాలపురం నియోజక వర్గానికి చెందిన పడమటి బుచ్చి బాబు, తణుకు నియోజకవర్గానికి చెందిన తెలకం కనకలింగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.