January 29, 2013

గురువారం నుంచి యాత్ర పునఃప్రారంభం

వైద్యుల సూచనలకు తలొగ్గిన చంద్రబాబు
పది రోజుల విరామానికి మాత్రం ససేమిరా

చంద్రబాబు పాదయాత్రకు మరో రెండు రోజు లు విరామం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆయన యాత్రను పునఃప్రారంభిస్తారు. కాలినొప్పి తీవ్రంగా బాధిస్తుండటం, నడుంనొప్పి, గొంతు సమస్య వేధిస్తున్న నేపథ్యంలో రెండు రోజులుగా చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. కంచికచర్ల మండలం పరిటాల వద్ద క్యాంపులో ప్రస్తుతం ఆయన బస చేశారు.

బాబు వైద్య పరీక్ష నివేదికలను పరిశీలించిన వైద్యులు, 8 నుంచి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటేనే సాధారణ స్థితికి వస్తారని తేల్చిచెప్పారు. చక్కెర శాతం పెరగడం, ఎడమ కాలు చిటికెన వేలు గా యం ఇంకా నొప్పి కలిగించటం, మడమ నొప్పిగా ఉండటంతో విశ్రాంతి తప్పనిసరి అని తేల్చారు.

దీనిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, చంద్రబాబు కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు. డాక్టర్ల సల హా మేరకు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అయితే, అన్ని రోజుల విశ్రాంతికి చంద్రబాబుకు ఒ ప్పుకోలేదు. 2 రోజులు విశ్రాంతి సరిపోతుందని, గురువారం నుంచి యాత్రను కొనసాగిస్తానని సర్దిచెప్పారు. ఈ విషయాన్ని గరికపాటి విలేకరులకు వెల్లడించారు.