February 16, 2013

సంక్షోభంలో ఉన్నాం..ఆదుకోండి

చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం తెనాలి మండలంలోని అంగలకుదురులో రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కోడెల శివప్రసాద్ అధ్యక్షత వహించగా చంద్రబాబు అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని రకాల పంటలు పండించే రైతులు అప్పు ల ఊబిలో కూరుకుపోయారని, పండించిన పంటకు సరై న గిట్టుబాటు ధర లేదని, ఫ్రౌల్టీఫాంలు నష్టాల్లో నడుస్తున్నాయని, సాగునీరు, కరెంట్ కోతల కష్టాలను చంద్రబాబుకు రైతులు ఆవేదనతో విన్నవించారు.

వెదురుబొంగులు సబ్సిడీపై ఇవ్వాలివీరమాచినేని వెంకటేశ్వరరావు (రైతు)తెనాలి పరిధిలో ఎక్కువ మంది రైతులు వరి పంటపై ఆధారపడుతున్నారు.

దీని వల్ల సాగునీటి కొరత ఎక్కువగా ఉండటంతో తక్కువ నీటి వినియోగం ఉన్న నిమ్మ, అరటి తోటల పెంపకంపై దృష్టి పెట్టాను. పెద్ద గాలి, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలకు తోట అంతా కూలిపోతుంది. ప్రభుత్వం స్పందించి వెదురు బొంగులు సబ్సిడీపై ఇస్తే రైతులకు మేలు చేసినవారు అవుతారన్నాడు. నిమ్మకాయలకు యార్డు లేకపోవడం వలన రైతులు నష్టపోతున్నారు. పసుపు రైతులకు మంచి విత్తనం అందించే యంత్రాంగమే లేదు.

రెండవ తడికి నీరివ్వాలిఈదర పూర్ణచంద్రరావు (రైతు)వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టా రైతులను పూర్తిగా ముంచేశారన్నారు. పది రోజుల్లో రెండో పం టకు నీరివ్వకపోతే చేతికొచ్చిన పంట చేజారిపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పారుదల అంశాలపై నవంబర్‌లో జరగాల్సిన ఇరిగేషన్ ఇంజనీర్ల సమావేశం ఇప్పటికీ జరగకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమన్నారు.

రైతులు ఉపాధి కూలీలుగా మారుతున్నారు..మేకల లక్ష్మీనారాయణ (రైతు)

ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయం సంక్షభంలో పడిం ది. అన్ని పంటలకు పెట్టుబడి ఎక్కువై కనీస మద్దతు ధర ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అ న్నదాతలు ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. ర్రాష్టానికి పట్టిన ఈ దరిద్రాన్ని రైతు లు వదిలించుకోవాలని కోరారు. మిరప ధరలు పడిపోయినపుడు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతుల ను ఆదుకోవాలన్నారు. రైతుల నుండి పంట నేరుగా వినియోగదారులకు అందే విధంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.

భూములు అమ్ముకోవాల్సి వస్తుంది.బాలకృష్ణ (రైతు)

పసుపు, కంద పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక ఉన్న భూమిని అమ్ముకోవాల్సి వస్తుందని బాలకృష్ణ అనే రైతు ఆవేదన చెందారు. ఎరువుల ధరలు పెరిగి కరెంటు, నీరు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.ఫ్రౌల్టీ రైతులు తీసుకున్న రుణాలురుణమాఫీ చేయాలిచల్లా సుబ్బారావు (రైతు)

ఫ్రౌల్టీ రంగంలో కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడివున్నారని రైతు చల్లా సుబ్బారావు పేర్కొన్నారు.

బ్యాంకుల నుండి లక్షల రూపాయల రుణాలు తీసుకొని ఫారాలు నడుపుతున్నామన్నారు. దాంతో వచ్చిన ఆదాయంతో కనీసం కుటుంబాన్ని కూడా పోషించలేని పరిస్తితి నెలకొందన్నారు.

రైతు వ్యాపారవేత్తగా ఆలోచించాలిశాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణగుంటూరు జిల్లా ప్రపంచంలో వ్యవసాయానికి మార్గదర్శకమని శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ తెలిపారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి సంక్షభంలో ఉ న్నారన్నారు. నూతన విధానాలను తెలుసుకొని ఆదాయం ఎక్కువగా వచ్చే పంటలను ఎన్నుకొని ప్రతి రైతు వ్యాపారవేత్తగా ఆలోచించాలని సూచించారు.