April 26, 2013

చరిత్రాత్మకమైన 'వస్తున్నా .. మీకోసం'.......లక్షలాదిగా తరలిరానున్న ప్రజలు

చంద్రబాబు నాయుడు లాంగ్ మార్చ్
శనివారంనాడు విశాఖలో ముగింపు సభ

హైదరాబాద్ క్రిందటి సంవత్సరం ఒక దశలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో నిరుత్సాహం గూడు కట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ మళ్లీ కోలుకోగలదా అన్న సందేహం అందరినీ పట్టి పీడించిన సమయం అది. ఆ సమయంలో పాదయాత్రతో ప్రజలకు చేరువ కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆరు పదులు దాటిన ఈ వయస్సులో పాదయాత్రలు ఏమిటని విమర్శించినవారున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలదన్న విశ్వాసం ప్రజలకు కలగాలంటే పాదయాత్రకు మించిన ప్రత్యామ్నాయం లేదని విశ్లేషకులు పేర్కొన్నారు.

ముందుకు పోవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు 2012 అక్టోబర్ రెండవ తేదీన హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఆయన ప్రజల కష్టనష్టాల గురించి విన్నారు. వారిలో ఒకరుగా కలిసిపోయారు. ప్రజల చెంతకు వచ్చేవాడే నాయకుడు అన్నట్టుగా ప్రజలతో మమేకం అయిపోయారు. రైతన్న దగ్గరికి వెళ్లి పొలం దున్నారు. వడ్రంగి దగ్గరకు వెళ్లి తానూ ఆ పనిలో ఒక చేయి వేశారు. రోడ్డు పక్కన చాయ్ చేసి అమ్మే చాయ్ దుకాణంలో తానూ చాయ్ తయారు చేశారు.

చంద్రన్నా మళ్లీ నువ్వే రావాలన్నా అని ఎందరో తమ్ముళ్లు చంద్రబాబుకు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. ముసలీ ముతకా తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి వారి సమస్యలు చెవి వొగ్గి విన్న బాబు వారికి ఎన్నో వరాలు కురిపించారు. ఎన్నో జిల్లాలలో డిక్లరేషన్‌లు ప్రకటించారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో శనివారంనాడు బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతున్నది. ఈ సభకు కనీసం ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొంటారని భావిస్తున్నారు.
: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. 63 ఏళ్ల వయస్సులో ఎవ్వరూ చేయని సాహసం చేసిన చంద్రబాబు ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 2800 కిలోమీటర్లు పైగా నడిచారు. మధ్యలో అనారోగ్యం ఇబ్బందులకు గురి చేసినా ఆయన వెరవక, బెదరక మొండిగా పాదయాత్ర కొనసాగించారు.