April 26, 2013

విశాఖ తరలుతున్న తెదేపా శ్రేణులు

ఒంగోలు: విశాఖలో శనివారం జరగనున్న తెలు గుదేశం పార్టీ బహిరంగ సభలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఆపార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నారు. అందుకోసం శుక్రవారం రాత్రి ఒంగోలు నుంచి ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు స్థానికంగా ఎక్కడికక్కడ నుంచి వాహనాలలో కూడా భారీగా వెళ్ళేందుకు సమాయత్తమవుతున్నారు. పార్టీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి గురువారమే విశాఖకు బయలు దేరి వెళ్ళారు. ఇతర ముఖ్య నాయకులు శుక్రవారం వెళ్ళనున్నట్టు సమాచారం. సుమారు ఏడు మాసాలకు పైగా వస్తున్నా ... మీ కోసం పేరుతో తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర ఈనెల 27న విశాఖలో ముగియనుంది.

ఆ సంద ర్భంగా ఆరోజున విశాఖలో తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. శనివారం సాయం త్రం నాలుగు గంటలకు యాత్ర ము గింపు చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరణ, అనంతరం బహిరంగ సభ జరగనుండగా పెద్ద సంఖ్య లో కార్యకర్తలు పాల్గొనేలా ఆధిష్ఠానం దృష్టి సారించింది. ప్రధా నంగా విశాఖకు ఇరువైపులా ఉండే నాలుగైదు జిల్లాల నుంచి జన సమీ కరణ చేస్తున్నప్పటికీ కోస్తా ప్రాం తంలో ఉండే ఇతర జిల్లాల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉండే ము ఖ్య నాయకులు హాజరయ్యేలా చూ డాలని నిర్ణయించారు. తదనుగు ణంగా జిల్లాలోను ఆపార్టీ నేతలు దృష్టి సారించారు. ఇందుకోసం వారం క్రితం పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఒం గోలు నుంచి విశాఖకు ఒక ప్రత్యేక రైలులో కార్యకర్తలు, నాయకులను తరలించేలా ఏర్పాటుచేయాలని నిర్ణ యించారు.

తదనుగుణంగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైలు ఒంగోలు నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి విశాఖకు చేరుతుంది. తిరిగి ఆ క్కడ బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆర్ధరాత్రి బయలుదేరి ఆదివారం మధాహ్ననికి ఒంగోలు చేరుకుంటుంది. ఆమేరకు రేల్వే శాఖ నుంచి జిల్లా నేతలకు సమాచారం అందింది. మొత్తం 21 బోగీలను ఈ ప్రత్యేక రైలుకు కేటా యించామన్నారు.దీంతో జిల్లాలోని వివిధ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో చర్చించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఒక్కో నియోజ కవర్గానికి రెండు లేదా మూడు బోగీ లను కేటాయించినట్టు సమాచారం. జిల్లాలో ఒంగోలు, చీరాల రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. దీంతో ఎక్కువ నియోజకవర్గాల వారు ఒం గోలు
లో రైలు ఎక్కే విధంగా సమా చారం అందించారు. మరోవైపు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల లోనూ పార్టీ నాయకులు తరలుతు న్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు అంతా విశాఖ సభకు తరలి వెళ్తున్నట్టు సమాచారం. పార్టీ సీనియర్ నేత కరణం బలరామకృ ష్ణమూర్తి గురువారమే విశాఖకు బయలు దేరి వెళ్ళారు. ఒంగోలు నుంచి మధ్యాహ్నం కోరమండల్ ఎక్స్ ప్రెస్‌లో బయలుదేరిన ఆయన రా త్రికి విశాఖ చేరుకున్నారు. శుక్రవారం ఆయన చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం ఉంది. కందుకూరు, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు డాక్టర్ దివి శివరాం, ఏలూరి సాం బశివరావులు ఇప్పటికే విశాఖ చేరు కున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యు డు శిద్దా రాఘవరావు, జిల్లా ఆధ్య క్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తదిత రులు శుక్రవారం రాత్రికి బయలుదేరి వెళ్ళనున్నట్టు సమాచారం.