March 27, 2013

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అనపర్తి/మండపేట
: కాంగ్రెస్ ప్ర భుత్వ వైఫల్యాలు, పిల్ల కాంగ్రెస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 'వస్తున్నా... మీకోసం' యాత్రలో భాగంగా మంగళవారం అ నపర్తి మండలం పెడపర్తిలో బస చేసిన బాబు మధ్యాహ్నం ముమ్మిడివరం నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షించారు. ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. ముందుగా చంద్రబాబునాయుడుకు బుడుగ జంగాల రాష్ట్ర నాయకులు రిజర్వేషన్‌పై వినతిపత్రాన్ని సమర్పించారు.

బీసీలో ఉన్న తమను ఎస్సీలలో కలపాలని వారు కో రారు. గంగిరెద్దుల కులస్థులను కూడా ఎస్సీలలో చేర్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకు మాట్లాడాల్సిందిగా కోరినపుడు కార్యకర్తలు పొగడ్తలు వద్దు పేదల రాజ్యం రైతు రాజ్యం లక్ష్యంగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు చంద్రబాబుకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీడీపీలోని సామాజిక న్యాయం అమలవుతుందన్నారు. టీడీపీలో అందరికీ సమన్వ యం జరిగిందన్నారు. దళితులను ఉ న్నత పదవులు అందించింది టీడీపీయే అని గుర్తు చేశారు. వైఎస్. నోడల్ ఏజ న్సీ పేరిట రాష్ట్రాన్ని దోచేశారన్నారు. ఎస్సీల నిధులు ఇడుపులపాయ, హు స్సేన్‌సాగర్‌కు తరలించారన్నారు.

త మ హయాంలో దళితులకు భూము లు కొనుగోలు చేసి ఇస్తే వైఎస్. పరిశ్రమలకు కట్టబెట్టారని ఆరోపించా రు. తమ ప్రభుత్వం రూ.300 కోట్లు ఎస్సీ రుణాలు మాఫీ చేసిందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ పేరిట ప్రభుత్వం రూ. 800 కోట్లు విడుదల చేసి వాటిని బ్యే లెట్ బాక్సులకు తరలించి ఎస్సీలను నిర్వీ ర్యం చేసిందని ఇసుకుబట్ల వెంకటేశ్వరరావు బాబు దృష్టికి తెచ్చారు. పశువుల్లంకకు చెందిన ఉమామహేశ్వరరా వు అనే యువకుడు అగ్రవర్ణాల పేదలకు కూడా న్యాయం చేయాలని కోరారు. 7.50 లక్షల బి.ఈడీ నిరుద్యోగులుండ గా వారు ఎస్జీటీకీ అనర్హులంటూ ప్రభు త్వం ప్రకటించడంపై స్పష్టత ఇవ్వాలని బాబును కోరారు.

దీనిపై బాబు మాట్లాడుతూ అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్ కల్పించి ఆదుకుంటామన్నా రు. కాపులకు కూడా నాయ్యం చేస్తామన్నారు. ఎం.రాజేష్ అనే వికలాంగుడు మాట్లాడుతూ వికలాంగులకు రాజకీ య పదవులు కల్పించాలం టూ కోర గా బాబు స్పందించి వికలాంగులకు ఫించను, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. తాళ్లరేవుకు చెందిన కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి నష్టం తప్పదని సీఎం.గా బాబు ము మ్మిడివరం ఎమ్మెల్యేగా బుచ్చిబాబు గెలవడం తధ్యమ ని పేర్కొన్నారు. కార్యకర్తల కృషితోనే టీడీపీ కుటుంబం ఇలా ఉందని బాబు అన్నారు. ముమ్మిడివరం టీడీపీ అభ్యరి«్ధగా బుచ్చిబాబును ప్రకటించాలని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నీలకంఠేశ్వరరావు కోరారు.

మహిళలకు రక్షణ కల్పించి వారికి అన్నింటా ప్రాధాన్యం ఇవ్వాలని కొమరిగిరి మాజీ సర్పంచి సాకాసీతాదే వి కోరారు. మహిళలకు ఉద్యోగ, విద్య రాజకీయలలో అవకాశాలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసిన ఘనత టీడీ పీదే అన్నారు. తాళ్లరేవుకు చెందిన దూ ళిపూడి బాబి అవినీతిపై తాను చేసిన ఎస్ఎంఎస్‌లపై వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని ఎన్నికలలో విజ యం సాధిస్తే మీ యోగక్షేమాల బాధ్య త తనదేనంటూ భరోసా ఇచ్చారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బుచ్చిబాబు చంద్రబాబును సన్మానించారు.

సమావేశం మధ్యాహ్నం గం టంపావు వరకు నిర్వహించారు. స మావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ని మ్మకాయల చినరాజప్ప, అనపర్తి మా జీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ము మ్మిడివరం నియోజకవర్గ ఇన్‌చార్జి దా ట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, మాజీ జడ్పీటీసీలు కాశి పరిరాజకుమార్, నాగిడి నాగేశ్వరరావు, గాదిరాజు సత్యనారాయణరా జు, ఐ.పోలవరం మాజీ ఎంపీపీ పేరాబత్తుల రాజశేఖర్, దూలిపూడి బాబి, గంగ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు సాకా సీతాదేవి, బీర సత్యకుమా రి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దొంగ సాక్షి కథనాలన్నీ అబద్దాలే. సాక్షి దినపత్రిక కథనాలన్నీ అబద్దాలేనని అదో విషపు కన్య అని చంద్రబాబు అన్నారు. అనపర్తి మండలం పె డపర్తిలో జరిగిన టీడీపీ సమీక్షలో ఆ యన పైవిధంగా ప్రస్తావించారు. మనమీద వ్యతిరేక వార్తలు రాయడం వారి కి పని. మనం వస్తే వారి మనుగడ ఉండదని వారికి భయం. అలాంటి పత్రికల్లో కథనాలు చదవడం తగదని ఆయన కార్యకర్తలకు సూచించారు.

నక్కా రామకృష్ణ, టి.కొత్తపల్లి యానాం రీజెన్సీలో 3 వేల మంది పనిచేసేవారము. అక్కడ గొడవల వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. దానిని తిరిగి తెరిపించేలా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై బాబు స్పందిస్తూ ఫ్యాక్టరీ మీద దాడి జరిగింది. కార్మికులు, యాజమాన్యం రోడ్డునపడ్డారు. అక్కడ ఎమ్మెల్యేకు, స్థా నిక ఎంపీకి మధ్య ఉన్న విభేదాల వల్ల ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో సంబంధంలేని ఎంపీ జోక్యం చే సుకుని కంపు చేశారని అన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, తాను అరాచకాలను సహించనని అన్నారు.