April 18, 2013

ప్రభుత్వం నిధులిస్తేనే అభివృద్ధి

 ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. బుధవారం కాచారం, నర్కూడ, కవ్వగూడలో జరిగిన 'ఇందిరమ్మ కలలు' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ఇందిరమ్మ కలలు పథకం పేరుతో ప్రజలలోకి వెళ్లితే వారికి ఇచ్చిన హామీలను ఏవిధంగా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకలను ప్రవేశ పెడుతుందన్నారు. సంక్షే మం పేరుతో ఎస్సీ, ఎస్టీలకు ఉపప్రణాళిక చట్టం13 అమలుకు కాంగ్రెస్‌ప్రభుత్వం నడుంబిగించింది.

అయితే దాని అమలు మాత్రం అంతంత్ర మాత్ర మే ఉంటుందని విమర్శించారు. కాచారంలో గ్రామస్థులు సమస్యలపై ఎకరువు పెట్టారు. గ్రామంలో తాగునీరు, కరెంటు, అండర్ డ్రైనేజీ తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. కాగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో శ్రీకాంత్‌రెడ్డి ఎవరికి ఏమీ కావాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఆర్. గణేష్‌గుప్త, టీడీపీ మండల అధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, టౌన్ అధ్యక్షుడు దూడల వెంకటేష్‌గౌడ్, పీఎస్‌సీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దండు ఇస్తారి, కాచారం మాజీ సర్పంచ్ సావిత్రిసత్తయ్య, మాజీ ఎంపీటీసీ జ్ఞానేశ్వర్‌యాదవ్, యూ.రాములు, ప్రత్యేకాధిరి నర్సింహరావు, ఏఈ పాల్గొన్నారు.

చౌదరిగూడలో..

చౌదరిగూడలో ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పర్యటించారు. గ్రామంలో తాగు నీరు కలుషితం అవుతుందని కొందరికి ఇళ్లు లేవని, పింఛన్లు కూడా రావడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పింఛన్లు లేనివారు. ఇళ్లు లేని వారు దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్ అధ్యక్షుడు మోహన్‌రావు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

నర్కూడలో...

నర్కూడలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీరోడ్లు, శ్మశాన వాటికకు వెళ్లేందుకు రోడ్డు వేయించాలని గ్రామస్థులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. వాటిని వెంటానే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుక్కవేణుగోపాల్, నర్కూడ మాజీ సర్పంచ్ బుర్కుంట సతీష్, కుమార్‌యాదవ్, నీరటిరాజు,బుర్కుంట గోపాల్, శివాజీ, అప్ప, బుర్కుంట మహేష్ పాల్గొన్నారు.

కవ్వగూడలో...

కవ్వగూడలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో అండర్ డ్రైనేజీ, పింఛన్లు, కరెంటు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. సమస్య లను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదే శించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నర్సింహ, మాజీ ఉప సర్పంచ్ కృష్ణ, పంచాయితీ కార్యదర్శి విఠల్‌రెడ్డి,ఎం.రత్నం, మైసయ్యయాదవ్, పెంటయ్య, సిద్దులు తదితరులు పాల్గొన్నారు.