December 27, 2012

పలకరిస్తూ.. హామీలిస్తూ..



 
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం గం గారం నుంచి పోత్కపల్లి వరకు దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ మమేకమయ్యారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీలిస్తూ ముందుకు సాగారు. బుధవారం గంగారం, ఊషన్నపల్లి, లక్ష్మిపు రం, పందిళ్ళ, కొమిరె, జీలకుంట, పో త్కపల్లిగ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఉదయం సీమాంధ్ర నే తలతో భేటీ అనంతరం ఆయన ఆంధ్ర మేధావులు, విద్యావంతుల వేదిక ప్రతినిధులు, తెలంగాణ ప్రజాసంఘాల జే ఏసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అ నంతరం గంగారం నుంచి ఆయన పా దయాత్రగా బయలుదేరారు.

పాదయాత్ర ఆసాంతం చంద్రబాబు ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగారు. గంగారం గ్రామంలో మత్స్యకారులు వలలు, బు ట్టలు అందివ్వగా... వాటిని ప్రదర్శిస్తూ తాము అధికారంలోకి వస్తే కులవృత్తులను చేతివృత్తులను ప్రొత్సహిస్తానని, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. చెరువుల్లో నీ రులేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ఆయన దుయ్యబట్టారు. గంగారం జడ్‌పీ హైస్కూల్‌లో విద్యార్థులతో చం ద్రబాబు భేటీ అయ్యారు. వారి చదువు వివరాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు టాయిలెట్లు లేవని విద్యార్థులు చంద్రబాబు దృష్టికి తేగా ఎంపీల్యాడ్స్ నిధు ల నుంచి రెండున్నర లక్షల రూపాయ లు మంజూరు చేస్తున్నానని ప్రకటించా రు. శివగౌడ్ అనే గీతకార్మికుడిని కలిసి వృత్తి ఎలా సాగుతున్నదని ప్రశ్నించా రు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి ప డి మరణిస్తే పరిహారం ఇవ్వడం లేదని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

ఊషన్నపల్లిలో యాదవులు గొ ర్రెపిల్ల ఇచ్చి గొంగళి కప్పగా యాదవు ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తన ను కలిసిన మహిళలకు రోడ్లు, మురికికాలువలు బాగా లేవని తన దృష్టికి వచ్చిందని, టీడీపీ అధికారంలోకి వస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తామని అన్నా రు. దారిలో తనను కలిసిన వికలాంగు డు మేడిద అనిల్‌తో మాట్లాడుతూ తా ము అధికారంలోకి వస్తే వికలాంగుల కు 1500 రూపాయల ఫించను ఇస్తామని హామీ ఇచ్చారు. ఊషన్నపల్లిలోనే కొత్తగా పెళ్ళిచేసుకున్న రాజారాపు శివకుమార్, లత పెళ్ళి రిసెప్షన్ జరుగుతుండగా అక్కడకు వెళ్ళిన చంద్రబా బు వధూవరులను ఆశీర్వదించారు. మరో నూతన జంట గట్ల మల్లిఖార్జున్, రజిత వివాహం ఈరోజే జరగగా అక్కడకు వెళ్ళిన చంద్రబాబు వారిని ఆశీర్వదించారు. అక్కడే ఇద్దరు మహిళలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ మాకు తె లంగాణ కావాలనగా... కేంద్రం సహకరిస్తే తెలంగాణ వస్తుందని చెప్పారు.

ఆంజనేయస్వామి గుడిలో పూజలు చే శారు. పత్తిచేను వద్ద ఉన్న భార్యభర్తలిద్దరిని ప్రశ్నించి వారికి పింఛను రావ డం లేదని తెలుసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మొక్కజొన్న చేనులోకి వెళ్ళి జొన్న వి త్తనాలు విత్తారు. నోముల స్వరూప మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చం ద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఇం దిరమ్మ ఇంటి బిల్లులు ఇవ్వడం లేదని కొందరు మహిళలు ఫిర్యాదు చేయగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ముస్కు రాజమల్లు అనే రైతు పత్తి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయానని చెప్పగా ... మరో రైతు మల్లారెడ్డి కాంగ్రెస్ రైతులకే పంటనష్టపరిహారం వస్తున్నదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. తాము అధికారంలోకి వస్తే అందరి అ ప్పులు మాఫీ చేస్తానని హామీ ఇచ్చా రు.

ఇదివరకే ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మి అనే మహిళ తనకు మళ్ళీ ఆపరేషన్ చే యాల్సి ఉన్నదని, అయితే ఆరోగ్యశ్రీ కార్డు పని చేయదని చెబుతున్నారు... డబ్బు లేదని తన నిస్సహాయ స్థితిని వెల్లడించగా ఆమెకు ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మిపురం గ్రా మంలో పోచాలు అనే రైతుతో వరిధా న్యం మార్కెట్ ధరల గురించి మాట్లా డి తాము అధికారంలోకి వస్తే వరిధాన్యానికి రెండు వేల రూపాయల ధర ల భించేలా చూస్తానని హామీ ఇచ్చారు. పత్తి చేలో పత్తి ఏరుతున్న సంకీర్తన అనే బాలిక వద్దకు వెళ్ళి స్కూల్‌కు వెళ్ళకుండా పత్తి ఏరుతున్నావెందుకు అని ప్రశ్నించారు. ఆర్థిక స్తోమత లేక పాఠశాలకు వెళ్ళడం లేదని జవాబివ్వగా టీడీపీ అధికారంలోకి వస్తే పిల్లలందరి కీ ఉచిత విద్య, ఉపకార వేతనాలు అం దిస్తామని హామీ ఇచ్చారు. పందిళ్ళ గ్రామంలో ఎంఆర్‌పీఎస్ కార్యకర్తల ఆ హ్వానం మేరకు దళితవాడ మీదుగా త న పాదయాత్రను కొనసాగించారు.

బాబు ప్రసంగాల్లో కరీంనగర్ ప్రస్తావన...: తెలంగాణ ప్రాంతం అందులో క రీంనగర్ జిల్లా చైతన్యానికి మారుపేరు అని, ప్రేమిస్తే ఎత్తుకుంటారు... లేకుం టే ఎత్తిపడవేస్తారంటూ ప్రశంసించా రు. తన స్వంత జిల్లా చిత్తూరు కంటే కరీంనగర్ జిల్లాకే తాను అత్యధిక ప్రా ధాన్యత ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. రెండు మెడికల్ కళాశాలలు మంజూరు చేశానని, జిల్లావ్యాప్తంగా రోడ్లు వేయించానని అన్నా రు. 1500 కోట్ల రూపాయలతో శ్రీరాంసాగర్ కాలువ ఆధునీకరణ లైనింగ్ ప నులు చేయించి చివరి భూములకు సా గునీరిందించేలా చూశానని చెబుతూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించారు. జిల్లాకు కాని తెలంగాణకు కాని కేసీఆర్ చేసిందేమీ లేదని దుయ్యబట్టా రు. కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరందించే శ్రీరాంసాగర్‌పై బాబ్లీ ప్రాజె క్టు నిర్మిస్తే అడ్డుకోవడానికి ముందుకు రాలేదన్నారు. తాము ఆందోళన చేపట్టి జైలుకు వెడితే ఒక టీఎంసీ నీరు మంచినీటికి ఇస్తే తప్పా ... అంటూ మాట్లాడారని, ఇప్పుడు నీరు లేక ఈ ప్రాంతమంతా ఎడారిగా మారిందని, అది కే సీఆర్ చలవేనని ధ్వజమెత్తారు. ఈ జి ల్లాలో ఐదు లక్షల మంది బీడీ కార్మికు లు ఉన్నా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ వారి ప్రయోజనాలకు నష్టం వాటిల్లజేసే విధంగా బీడీకట్టలపై పుర్రె గుర్తు వేయించారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు లు, మహిళలను ఆకర్షించడానికి చంద్రబాబు ప్రయత్నించారు.

ముఖ్యంగా రై తులతో మాట్లాడిన చంద్రబాబు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి పలు హామీలిచ్చారు. తెలుగుదేశం పా ర్టీ అధికారంలోకి వస్తే ఎరువుల ధరలు తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర క ల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా చూస్తామని రైతులను ఆకట్టుకునేలా చంద్రబాబు ప్రసంగాలను కొనసాగించారు. ఏ రైతు నష్టపోకుం డా చూస్తామని, కాంగ్రెస్ అధికారంలో కి రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం హయాంలో, ప్రస్తుతం కరెంట్ సరఫ రా జరుగుతున్న తీరును పోల్చుతూ స ర్కారు పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. తెలుగుదేశం హయాంలో మిగులు కరెంట్ సాధించి తొమ్మిది గం టల పాటు కరెంట్ ఇస్తే.. ఈరోజు కాం గ్రెస్ హయాంలో ఏం జరుగుతున్నదో ఆలోచించాలని ప్రజలను కోరారు. టీ డీపీ హయాంలో క్వింటాలు పత్తిని నా లుగు వేల రూపాయలకు అమ్మితే ఇ ప్పుడు 3500 రూపాయలకు కొనే నా థుడు లేడు... వ్యవసాయం ఖర్చులు పెరిగాయని... గిట్టుబాటు ధర లేకుం డా పోయిందని అన్నారు.

డిసెంబర్ మాసంలో ఉన్నా సాగునీరు వదలడం లేదని,కరెంట్ లేకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ఎక్కడ చూసినా సబ్‌స్టేషన్లపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం కరెంట్ ఇవ్వలేనని చెబుతున్నదని, రై తులు ఏం కావాలని చంద్రబాబు ప్ర శ్నించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తుందని, సర్‌చార్జిలు, చార్జీలు తగ్గిస్తుందని ఆ యన హామీ ఇచ్చారు. పెరుగుతున్న ని త్యావసర వస్తువుల ధరల గురించి కూ డా చంద్రబాబు ప్రస్తావించి మహిళలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మార్కెట్‌కు వెళితే సరుకులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో జేబులో డబ్బు తీసుకొని వెడితే సంచినిండా సరుకులు వచ్చేవని, ప్రస్తుతం సంచిలో డబ్బులు తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

వంటగ్యాస్,పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయని, టీడీపీ హయాంలో చక్కెర 12 రూపాయలకు కిలో అమ్మితే ఇప్పుడు 25 రూపాయలకు చేరిందని, నాలుగు రూపాయల ఉల్లి నేడు 18 రూపాయలకు చేరిందని, వంటనూనెలు అప్పుడు 40 రూపాయ లు ఉంటే ఇప్పుడు 120 రూపాయలు అమ్ముతున్నారని చంద్రబాబు ప్రజల కు ధరల తేడాను వివరించారు. తమ హయాంలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి నిత్యవసర వస్తువులు కొని ధరలు పెరిగిన సందర్భాల్లో మార్కెట్‌లో సరఫరా చేసేవారమని, ఇప్పుడు ఎవరూ పట్టించుకోవ డం లేదని ఆయన విమర్శించారు. 12 వ రోజు పాదయాత్ర సందర్భంగా చం ద్రబాబుకు ప్రజల నుంచి మంచి స్పం దన లభించింది.