July 18, 2013

ఏకగ్రీవ 'పంచాయతీ'లు.....కాంగ్రెస్‌ - 720, టిడిపి- 608, వైఎస్‌ఆర్‌ సిపి- 440, టిఆర్‌ఎస్‌ - 97..

  మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలు అనధికారికంగా వెల్లడయ్యాయి. మాకు అందిన అసంపూర్తి సమాచారం ప్రకారం కాంగ్రెస్‌కు 720, టిడిపికి 608, వైఎస్‌ఆర్‌సిపికి 440, టిఆర్‌ఎస్‌కు 97 పంచాయతీలు లభించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరిగినప్పటికీ గ్రామాల్లో పార్టీ జెండాలతోనే నామినేషన్లు వేయడం, ప్రచారం చేయడం సర్వసాధారణం. సర్పంచ్‌ అభ్యర్ధులు గెలిచిన తర్వాత వారు తమ పార్టీ అభ్యర్ధులేనని ఆయా పార్టీలు కూడా చెప్పుకుంటాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్‌ బాగా డీలాపడింది. ఇక్కడ టిడిపి మొదటి స్థానంలో నిలవగా జగన్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌కు మూడోస్థానం దక్కింది. చిత్తూరు జిల్లాలో 300 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 103 టిడిపి మద్దతు దారులు గెలవగా 75 పంచాయతీలను వైఎస్‌ఆర్‌ సిపి మద్దతుదారులు గెలుచుకున్నారు.