February 9, 2013

మంచి రోజులొస్తాయ్..


చరిత్రలో ఎన్నడూ లేనంతగా సమస్యలు చుట్టుముట్టాయి. కాలువలు లేవు. తాగడానికి నీరు లేదు. దోమలు దాడి చేసి అనారోగ్యం భారిన పడేస్తున్నాయి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దోచేస్తున్నాయి. మీ కష్టాలు చూస్తున్నాను. త్వరలోనే మళ్లీ మంచి రోజులు తీసుకొచ్చే బాధ్యత తీసుకొంటానని జిల్లా ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.

శనివారం జిల్లా కేం ద్రంలోని ఎన్‌టీఆర్ నగర్, శారదాకాలనీ, రిం గురోడ్డు సెంటర్లలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.

వంటింట్లో ఉల్లిపాయలు కోస్తే నాడు కళ్ళ వెంట నీళ్లు వచ్చేవని, నేడు వాటి ధరను తలుచుకొంటేనే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. చక్కెర ధర రూ. 40కి పెరిగి స్వీట్లు తినే పరిస్థితి లేకుండా చేసింది. షు గర్ వ్యాధి లేకున్నా అందరినీ చక్కెరవ్యాధిగ్రస్తులుగా మార్చేసిందని చమత్కరించారు.

ప్రజలు కొనుగోలు చేసే తిండి గింజలు, బట్టలు, కరెంటు, సరుకులపై పన్నులు వసూలు చేస్తున్నారు. ఆ పన్నులను అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా కాంగ్రెస్ దొంగలు దోచేస్తున్నారని చెప్పారు. అవినీతిని అరికడితే ఏ చార్జీలను పెంచాల్సినఅవస రం ఉండదు. ఆర్థిక సంస్కరణలతో ప్రతీ ఇంటికి సంపద వచ్చింది. నేడు ప్రతీ ఇంట్లో రెండు, మూ డు సెల్‌ఫోన్లు వచ్చాయంటే అవి తన వల్లనేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

మహిళలు ఒకపక్క ఇంటిపని, మరోవైపు కూలీ పని చేస్తూ కష్టపడుతుంటే మగవాళ్లు మద్యం తా గుతూ ఇల్లాలిని కొడుతున్నారు. వాళ్ల ఆరోగ్యం పాడు చేసుకొంటున్నారు. నేను పాదయాత్రలో ఒక మద్యం సేవించే తమ్ముడిని అడిగితే తాగకపోతే భార్యను బాగా చూసుకొంటానని, తాగితే కొడుతున్నానని చెప్పాడు. బెల్టుషాపులు ఎత్తివేస్తే తాను కూడా మద్యం మానేస్తానన్నాడు. అందుకే రాష్ట్రంలో ఉన్న బెల్టుషాపులన్నింటిని రద్దు చేస్తాన ని హామి ఇవ్వడం జరిగిందని చంద్రబాబు చెప్పా రు.

ఆడబిడ్డల మంగళసూత్రాలు కాపాడి, మగవాళ్ల ఆరోగ్యం పరిరక్షిస్తానని చెప్పారు.

పిల్లలు తమను చూసుకోవడం లేదని చాలామంది పెద్దవాళ్లు నా వద్దకు వచ్చి వాపోతున్నా రు. వారి కష్టాలు చూసి ప్రతీ నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం నెలకొల్పాలనే హామి ఇస్తున్నా ను. అక్కడ సకల సౌకర్యాలు సమకూర్చి వృద్ధు లు హాయిగా జీవించే వాతావరణం కల్పిస్తాము. దీని వల్ల వృద్ధులకు ధైర్యం వస్తుందని చంద్రబాబు అన్నారు. విద్యార్థులకు సరైన స్కాలర్‌షిప్పులు రాకపోతుండటం వల్ల ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని, తాను పేద పిల్లల ఎంతవరకు చదువుకొంటే అంతవరకు చదివించి ఉద్యోగం, ఉపాధి కల్పించే బాధ్యత తీసుకొంటానని హామి ఇచ్చారు. చదువు అయిపోగానే వారికి నెలకు కొంత భృతి కల్పించి ఒక అన్నగా ఆదుకొంటానని చెప్పారు.

మీ ఆలోచనలో మార్పు రావాలి

మీ సంపద, కష్టాన్ని దోచుకొన్న వాడు ఎవడైనా నీచుడే. వాడిపై రాజీలేని పోరాటం చేయా లి. జాలి పడితే రేపు మీపై జాలి పడేవాళ్లు ఉం డరు. వెయ్యి లారీల వంద నోట్లు దోచుకొన్న జగ న్ చేసింది పాపామో, కాదో ఒక్కసారి ఆలోచన చే యాలని చంద్రబాబు సూచించారు. తప్పులు చేసిన వాళ్లంతా నేడు జైలుకెళ్లారు. చంచలగూడ జైలు వీఐపీ జైలుగా మారిపోయిందన్నారు. ఎవరైనా శుభకార్యం చేయతలపెడితే ఏ గుడికో, మసీదుకో, చర్చికో వెళతారు. జగన్ పార్టీలో చేరేవాళ్లు మాత్రం ముందు జైలుకెళ్లి అక్కడ కొబ్బరికాయ కొడతారు. డబ్బు సూట్‌కేసులు, ప్యాకేజీలకు ఆశపడి జైలు పార్టీలో చేరుతున్నారని ధ్వజమెత్తారు.

లోక కల్యాణం కోరికతో వచ్చా

నేను ఎలాంటి కోరికలు, ఆశలతో మీ వద్దకు రా లేదు. లోక కల్యాణం కోరికతోనే వచ్చాను. మీ కష్టాలు తీర్చడానికి వచ్చాను. నేను ఆరోగ్యం విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటాను. మితాహా రం తీసుకొంటాను. 63 ఏళ్లలో పాదయాత్ర చేస్తుండటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చా యి. ఎక్కువగా నడవడంతో కాలునొప్పి వచ్చిం ది. పాదయాత్రలో కిందపడిపోవడం వలన న డుం నొప్పి వచ్చింది. షుగర్ వ్యాధి సోకింది. పాదయాత్ర ఆపేయాలని వైద్యులు సూచించా రు. అయినాసరే పట్టుదలను వదిలి పెట్టకుండా మీ పిల్లల జీవితాలు బాగు చేసేందుకు మీ వద్దకు వస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

తల్లి పాము... పిల్ల పాము

కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లను చంద్రబాబు శనివారం తల్లి పాము, పిల్ల పాముతో పోల్చారు. నిన్న, మొన్నటి వరకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాం గ్రెస్ అన్న చంద్రబాబు నేడు స్వరం మార్చి తల్లి పాము, పిల్ల పాము అని వ్యాఖ్యానించారు. రెండిటికి విషం ఉంటుందన్నారు. అయితే తల్లి పాము కంటే పిల్ల పాములోనే ఎక్కువ విషం ఎక్కువగా ఉంటుందంటూ వైకాపాని తూర్పారబట్టారు.

పాదయాత్రకు హాజరైన జిల్లా నేతలు

శనివారం చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపా టి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శనక్కాయల అరుణ, జే ఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీలు ఎస్ఎం లాల్‌జాన్‌బాషా, వైవీ రా వు, మాజీ మేయర్ ఏసురత్నం, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎం జియావుద్దీన్, టీడీపీ జిల్లా నాయకులు యాగంటి దుర్గారావు, మన్నవ సుబ్బారావు, మ్యానీ, ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ఎలుకా వీరాంజనేయులు ఉన్నారు.