February 9, 2013

మీ కష్టాలకు కారకులెవరో ఆలోచించండి: బాబు


చైతన్యానికి మారు పేరు మీ జిల్లా. నేను కాంగ్రెస్, వైసీపీల దోపిడీ గురించి చెబుతున్న విషయాలను ఒక్కసారి ఆలోచించుకోండి. వాటిపై మీ కుటుంబ సభ్యుల్లో చర్చించుకొని ఒక నిర్ణయానికి రండి. నేను చెప్పిన విషయాలు వాస్తవమని నమ్మితే నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించండి. లేదం టే మీ ఇష్టం. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న నేను బాధ్యత కాబట్టి చెబుతున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చం ద్రబాబునాయుడు అవినీతి, దోపిడీపై ప్రజలను చైతన్యవంతం చేసేలా ప్రసంగిం చారు. శుక్రవారం చంద్రబాబు మూడో రో జు పాదయాత్రకు పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలంలో అపూ ర్వ స్పందన లభించింది.

పెదకాకాని మండల కేంద్రంతో పాటు వెనిగళ్ల, అగతవరప్పాడులో పాదయాత్ర కొనసాగించారు. చంద్రబాబుకు దారి పొ డవునా మహిళలు ఎదురెళ్లి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని ప్రదర్శించారు. యువకులు కేరింతలు కొడు తూ ఆనందా న్ని వ్యక్తం చేశారు. తమ కష్టం బెల్టుషాపు ల పాలౌతుందంటూ మహిళలు తమ గో డు చెప్పుకొన్నారు. అం దరి కష్టాలు తెలుసుకొన్న చంద్రబాబు తా ను అధికారంలో కి రాగానే కరెంటు, వంట గ్యాస్ భారాన్ని తగ్గిస్తానని హా మి ఇచ్చారు. నెలకు రూ. 600 పెన్షన్ ఇస్తానని హా మి ఇ చ్చారు.

ఐటీ హబ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఆటోమొబైల్ కేంద్రంగా మార్చి ఇక్కడ చదువుకొన్న పిల్లలకు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కాదని గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత తీసుకొంటానని చెప్పారు. పొదు పు సంఘాలను ప్రారంభించిన తనను 2004లో డ్వాక్రా మహిళలు మరిచిపోయి కష్టాలు కొని తెచ్చుకొన్నారని, కచ్ఛితంగా వారు చెల్లించిన వడ్డీని తిరిగి ఇప్పించి బాధలు తీరుస్తానన్నారు.

చంద్రబాబు మూడో రోజు పాదయాత్రను పెదకాకాని మండల కేంద్రానికి సమీపంలోని శంకర్‌నేత్రాలయ పక్కన బస చేసిన శిబిరం నుంచి ప్రారంభించా రు. ఐదో నెంబరు జాతీయ రహదారి మీద పెదకాకాని జంక్షన్ వరకు పాదయాత్రగా వచ్చి అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధానంగా పెదకాకాని ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఒకవైపు మల్లేశ్వరస్వామి దేవాలయం, మరోవైపు స్వస్తిశాల, ఇంకోవైపు కాకాని దర్గా ఉన్న ఈ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. మతాన్ని ఉపయోగించుకొంటూ రాజకీయ లబ్ధి పొందేవారికి వ్యతిరేకమని మీరు నిరూపించారని చెప్పారు.

నాడు... నేడు బేరీజు వేసుకోండి చంద్రబాబు పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో ప్రధానం గా నాటి పరిస్థితులను నేటితో బేరీజు వేసుకోమని సూ చిస్తున్నారు. రైతులు తన ను కలిసినప్పుడు తన పాలనలో ఎరువుల ధరలను ఇప్పటి రేట్లతో పోల్చి చూసుకోవాలని చెబుతున్నారు. ఆ రోజు డీఏపీ బస్తా ధర రూ. 400 ఉంటే నేడు రూ. 1300 అయిం ది. పత్తి ధర రూ. 5 వేల నుంచి రూ. మూడు వేలకు పతనమైంది. పొటాష్ రూ. 200 నుంచి రూ. 900లకు పెరిగిం ది. ధాన్యం మీకు కేజీకి రూ. 16 మాత్రమే ఇస్తూ బియ్యం రూ. 50 చేశారంటూ వివరిస్తున్నారు. అంతేకాకుండా ఆ రోజున కరువు వచ్చి ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోయినా పంటలకు నీరు ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. విద్యుత్ తొమ్మిది గంటల పాటు ఇచ్చామని, నేడు కనీసం రెండు గంటలు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. కష్టాల కడలిలో వ్యవసాయం చేస్తోన్న రైతులను ఆదుకొనేందుకే తాను రుణమాఫీని ప్రకటించి తొలి సంతకం దాని పైనే చేస్తానని చెబుతున్నానన్నారు.

మహిళలతో సంభాషించే సమయంలో వంటగ్యాస్, కరెంటు ఛార్జీలను ప్రస్తావిస్తున్నా రు. వంట గ్యాస్ నాడు రూ. 235 ఉంటే నేడు రూ. 475కు చేరుకొందని, అది కూ డా సంవత్సరానికి ఆరు సిలిండర్లే ఇస్తామంటున్నారని చెప్పారు. ఒక ఫ్యాను, బల్బు ఉంటే నెలకు రూ. వెయ్యి కరెంటు బిల్లు వేస్తున్నారని, మీరే ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులతో సంభాషించేటప్పుడు కేంద్రం రూ. 400 పెన్షన్ ఇస్తుంటే రూ. 200 కాంగ్రెస్ వాళ్లు కొట్టేస్తున్నారని చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ. 600లకు పెంచుతానని చెబుతూ ఆకట్టుకొంటున్నారు.

కాంగ్రెస్, వైసీపీలపై పదునైన ఆరోపణలు చంద్రబాబు తన ప్రసంగా ల్లో కాం గ్రెస్, వైకాపాలను ఏకిపారేస్తున్నారు. వైసీపీని జైలు పార్టీగా అభివర్ణిస్తూ ఆ పార్టీలో చేరాలంటే ముందు చంచల్‌గూడ జైలుకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి నమస్కరించి చేరాలన్నారు. జైలు పార్టీలో చేరిన వాళ్లు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తొమ్మిదేళ్లలో పందికొక్కులా మేశారని ఘాటుగా విమర్శిస్తున్నారు. పందికొక్కులు పంటల మీద పడి మొత్తం తిని ఎలాగైతే నాశనం చేస్తాయో అదే రీతిన రాష్ట్రంలో గజదొంగల్లా కాంగ్రెస్ నాయకులు పడి దోచేసి కుక్కల చింపిన విస్తరిలా మార్చారని ఆగ్రహావేవాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగా సిటీ హామీ గుంటూరు, విజయవాడలను మహానగరంగా చేసి ఐటీ హబ్‌గా మారుస్తానని చం ద్రబాబు హామి ఇస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ను తలదన్నే రీతిలో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొంటానని చెబుతున్నారు. ఐటీ హబ్‌తో పాటు వ్యవసాయాధారిత పరిశ్రమలు, రింగురోడ్లు, ఆటోమొబైల్ కేంద్రంగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని పేర్కొంటున్నారు.

మందు ఫుల్... మంచినీళ్లు నిల్ కృష్ణా నది చెంతనే ఉన్నా గుంటూరు లో అనేక గ్రామాలకు తాగునీరు అంద డం లేదని, మందు మాత్రం ప్రభుత్వం ఫుల్‌గా సరఫరా చేస్తోందన్నారు. రూ. 20 ఉండే క్వార్టర్ బాటిల్‌ను నేడు రూ. 100 చేసిందన్నారు. ప్రతీ ఇంట్లో బెల్టుషాపు లు తెరిచి మద్యంతో పేద ప్రజల బ తుకులు చితికిపోయేలా చేస్తోందని చెప్పారు. తాను బెల్టుషాపులను తొలగిస్తానన్నారు.