February 9, 2013

టీడీపీ పిటీషన్‌లోని ప్రధానాంశాలు

- 2010-2012 మధ్య కాలంలో సర్కారు మూ డు సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై రూ. 6870 కోట్ల భారాన్ని మోపింది. మళ్లీ మరో రూ. 12,723 కోట్లు బాదడానికి సిద్ధమైంది. ఇది ప్రజా సంక్షేమానికి వ్యతిరేకం.
- టెలిస్కోపిక్ విధానాన్ని తొలిగించి రెండు సార్లు చార్జీలు పెంచడం దారుణం. దాన్ని పునరుద్ధరించాలి.
- ఇప్పటికే రూ. 7771 కోట్లను ఇంధన సర్‌చార్జ్ రూపంలో దొంగతనంగా మోపి, మళ్లీ మరో రూ. 982 కోట్ల సర్‌చార్జి విధించాలని సర్కారు చూస్తోంది. ఇవేకాక రూ. 3171 కోట్ల సర్‌చార్జీల వసూలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 0-100 యూనిట్ల వరకు వాడుకునే వారిపైనా ఈ భారం పడుతోంది.
- ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తోంది. జెన్‌కోకు బదులు ప్రైవేటు సంస్థలకే గ్యాస్, బొగ్గు కేటాయింపులను ప్రోత్సహిస్తోంది.
- అధిక ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటూ 2008-09 నుంచి 2011-12 మధ్య కాలంలో డిస్కంలపై ఒత్తిడి చేయడం వల్ల అవి రూ. 11,111 కోట్ల అప్పుల్లో కూరుకున్నాయి.
టీడీపీ డిమాండ్లు..
- విద్యుత్ చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యుత్ రంగానికి బడ్జెట్ పెంచాలి. ప్రస్తుత విద్యుత్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. - టెలిస్కోపిక్ విధానాన్ని కొనసాగించాలి. వ్యవసాయ ఇంధన సర్‌చార్జీని ప్రభుత్వమే భరించాలి. 0-100 యూనిట్లలోపు వినియోగదారులపై కస్టమర్ చార్జీలను తొలగించాలి.