February 9, 2013

కొండవీటి వాగు సమస్యను పరిష్కరిస్తాం...

దేశం ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే కొండవీటివాగు ముంపు సమస్యను శాశ్వత ప్రాతి పదికన పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హమీనిచ్చారు. వస్తున్నా...మీకోసం పాద యాత్రలో భాగంగా పెదకా కానిలో వున్న చంద్రబాబు ను శుక్రవారం ఉదయం మంగళగిరి దేశం నాయకుల బృందం కలిసి నియోజకవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. చంద్రబాబు మాట్లాడుతూ కొండవీటి వాగు సమస్యపై తనకు అవగాహన ఉందని దేశం ప్రభుత్వ హాయాంలో వాగులో రెండేళ్లపాటు పూతికతీత తీయించి వరద తీవ్రత తగ్గించ గలిగామని మండల దేశం పార్టీ అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్ బాబుకు గుర్తు చేశారు.

ఆ తరు వాత అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొండవీటి వాగు ముంపు నివారణకు హమీలు గుప్పించడం మినహా ఏమీ చేయలేకపో యిందని వివరించారు. తన యాత్ర విజయవంతానికి కృషి చేసిన మంగళగిరి దేశం నాయకులందరిని ఆయన పేరుపేరున అభినందించారు. చంద్ర బాబును కలిసిన బృందంలో మండల దేశం అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్, పట్టణ దేశం అధ్యక్షుడు నందం అబద్దయ్య, దేశం నేతలు వల్లూరు సూరిబాబు, కొల్లి లక్ష్మ య్య చౌదరి, సంకా బాలాజీగుప్తా, వాకా మంగారావు, చిల్లపల్లి మోహనరావు, గోవాడ రవి, పల్లపు పిచ్చియ్య తదితరులు వున్నారు.