January 11, 2013

ఎడా పెడా కోతలు..అన్నదాతల వెతలు







రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్ర స్తావిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్నదాతలందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. వస్తున్నా మీ కో సం కార్యక్రమంలో భాగంగా కూ సు మంచి గ్రామంలో చంద్రబాబు నాయు డు బసచేసిన ప్రాంగణంలో టీడీ పీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎండిపోయి న వ రి, మిర్చి, పత్తి, అరటి పంటల తో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈసందర్భం గా ఉదయం 11:45 నిమషాలకు ఆ య న పాదయాత్ర ప్రారంభించారు. అయితే యాత్ర ప్రారంభానికి ముందు రైతు సం ఘం నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈసందర్భం గా రైతు సంఘం నేతలు నీలం తుఫాన్ వల్ల, ఎడాపెడా కరెంట్ కోతలతో రై తు లు నష్టపోతున్నార ని బాబుకు వివరించారు. అకాల వర్షాలకు పంటలు పూ ర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పండిన పం టలకు మార్కెట్లో గిట్టుబాటు ధర క ల్పించడం లేదన్నారు. వ్యవసాయానికి సరఫరా చేసే కరెంట్లో ఇష్టారీతిలో కోతలు విధిస్తున్నారన్నారు. వెంటనే సీసీ ఐ ద్వారా పత్తికి రూ. 5వేల మద్దతు ధర చెల్లించాలన్నారు. అదే వి ధంగా నీలం తుఫాన్ బాధితులకు పంట రుణాలనుపూర్తి మాఫీ చేయాలన్నారు. రంగు మారిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధ ర చెల్లించాలన్నారు. వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ను అందించాలన్నారు. రైతుల రుణాలు మాఫీచేయాలన్నారు. రుణాలను రీ-షెడ్యూల్ చేయాలని కోరా రు. ఆదుకోవాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిచాలని రైతు సంఘంనేతలు చం ద్రబాబును కో రారు.

అన్నదాతల సమస్యలను

అసెంబ్లీలో ప్రస్తావిస్తా

దీనికి స్పందించిన బాబు రైతు సమస్యలపై శాసనసభలో చర్చించి అన్నదాతలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తానని హామీ ఇ చ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరా వు, నేతలు గుత్తా వెంకటేశ్వరరావు, మ ందడపు సు ధాకర్, పంతంగి వెంకటేశ్వ ర్లు, తన్నీరు వెంకటేశ్వర్లు, ఇంటూరి పుల్లయ్య, బోజె డ్ల వెంకటయ్య, వడ్డే రా మయ్య, ఏలూరి హనుమంతరావు పా ల్గొన్నారు.