January 11, 2013

ఉపాధి కరువు.. బతుకు బరువు –



 


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం కూసుమంచి మండలంలో శుక్రవారం పాదయాత్ర నిర్వహి ంచారు. మహిళలు, రైతులు, కూలీలు ఆయనకు స్వాగతం పలికారు. తమ గో డును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం ద్వారా ఏ సదుపాయాలు అందడంలేద ని, నానా కష్టా లు అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని బా బు హామీ ఇచ్చారు.

నాసిరకమైన మందులు అంటగడుతున్నారు

'పత్తి, మిరప పంటలను సాగు చేస్తు న్నాం. వాతావరణంలో మార్పుల వల్ల పంట చేలకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. స లహాలు సూచనలు అందిచాల్సిన వ్య వసాయశాఖాధికారులు పత్తా ఉండటం లేదు. వారు ఎప్పడొస్తారో కూడా తె లియడం లేదు. ఎరువుల దుకాణాల వ ద్దకు వెళ్తే వ్యాపారులు నాసిరకమైన మందులు అంటగడతున్నారని'' రైతు వడ్తియా ర మేష్ బాబు ఎదుట వాపోయారు. ఎ రువుల ధరలు పెంచారని, గిట్టుబాటు ఉత్తమాటవుతోందని ఆవేదన వ్యక్తం చే శారు. చంద్రబాబు మట్లాడుతూ ఇది ద రిద్రపుగొట్టు ప్రభుత్వమని, భవిష్యత్తు లో మంచిరోజులొస్తాయని రైతు భుజం తట్టారు.

కూలీపనులు కరువయ్యాయి

గ్రామాల్లో పనులు లేకపోవడంతో ఇ బ్బంది పడుతున్నామని గిరిజన కూ లీలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఉ పాధి కూలీ కెళితే రోజుకు రూ. 30 కూ డా పడడం లేదని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి బతుకు దుర్భరంగా మా రిందన్నారు. చంద్రబాబు మట్లాడుతు వ్యవసాయానికి ఉపాధి ప«థకాన్ని అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చారు.

గోడు చెప్పుకున్న ఎస్సారెస్పీ భూ నిర్వాసితులు

ఎస్సారెస్పీ కాల్వ భూనిర్వాసితులు బా బుకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. విలువైన భూముల్లో కాలువలు తీసి వదిలేశారన్నారు. నేటికీ నీరు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పలికే భూ ములకు నామామత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు వైఎస్ఆర్ కుటుంబానికి కాసులు కురిపిస్తే రైతులకు కన్నీళ్లు తెప్పించాయ న్నారు. రానున్న కాలంలో అందరికి మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు.