March 28, 2013

అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

బిక్కవోలు: అవినీతి, కల్తీ ప్రభుత్వా న్ని గద్దెదింపాలని వస్తున్నా మీకోసం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి తొస్సిపూ డి సెంటర్‌లో ప్రజలకు పిలుపు ని చ్చా రు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించి పాదయాత్ర ప్రారంభించి చంద్రబాబు ప్ర సంగించారు. అనంతరం రాయవరం మునసబు విగ్రహం వద్ద నివాళులు అర్పించి కొమరిపాలెం బయలు దేరా రు. కొమరిపాలెంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, నియోజకవర్గపు ఇన్‌చార్జి రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు స్వాగతం పలికారు.

దారి పొడవునా ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. తొస్సిపూడి సెంటర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. నిత్యావసరధరలు, వంటగ్యాస్, పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగిపోయినా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. మందులు, ఎరువులు, పురుగు మందులు అన్నీ కల్తీ మయం అయ్యాయని ఆయన ఎద్దేవా చేసారు.

తాము అధికారంలో వున్న తొమ్మిదే ళ్ల పాలనలో రూ.1600 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచామని అయితే నేడు కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.32వేల కోట్లు విద్యు త్ చార్జీలు పేరిట అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. తాము కరువు వచ్చినపుడు కూడ రైతులకు 9గంటలు కరెంటు సరఫరా చేసావారమని ప్రస్తుతం మూడు గంటలు కూడ ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం వుంద ని దుయ్యబట్టారు.

అసెంబ్లీలో కరెంటు కోసం ఎమ్మేల్యేలు నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వానికి సిగ్గులేదని విమర్శించారు. త్వరలో ప్రభుత్వ అవినీతిపై ప్రతి గ్రామంలోను సంతకాల ఉద్య మం చేపట్టి ఈప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆపై గ్రామస్తులను సమస్యలపై మాట్లాడ వల్సిందిగా ఆయన కోరారు.

బాబుకు బ్రహ్మరధం కొమరిపాలెం వచ్చిన చంద్రబాబుకు మహిళలు, ప్రజలు అడుగడుగునా బ్ర హ్మరథం పట్టారు. పాదయాత్రలో తనను చూడడానికి వచ్చిన మహిళలు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెల్సుకున్నారు. పాదయాత్రలో దేశం నేతలు మురళీమోహన్, చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, రాష్ట్రటీడీపీ వాణిజ్యవిభాగపు కార్యదర్శి చింతా శ్రీనివాసరెడ్డి, తాడి అరవిందం, కొవ్వూరి వేణు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.