March 28, 2013

చీకటి రాష్ట్రం

కాకినాడ సిటీ: విద్యుత్ సర్‌చార్జీలు, కోతలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్‌పై సీఎం మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా విద్యుత్ కోతలకు వైఎస్, కాంగ్రెస్సే కారమణమని ఆరోపించారు.

'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్రలో భాగంగా బుధవారం రాయవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. బడ్జెట్‌లో టీడీపీ 7.5 శాతం నిధులు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 3.5శాతం మాత్రమే కేటాయిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తన హయాంలో విద్యుత్ ప్రైవేటు సంస్థలను ఏర్పాటుచేయడానికి అనుమతి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌కు 32 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు.