March 28, 2013

పేదల కోసమే ఈ ధర్మ పోరాటం

కాకినాడ సిటీ: పేదలకోసం తాను ఈ ధర్మ పోరాటం సా గిస్తున్నానని నారాచంద్రబాబునాయుడు అన్నారు. బుధవా రం రాయవరం మండలంలో 177వ రోజు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసం గించా రు. పాత సంతమార్కెట్ సమీపంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని, పెంచిన సర్‌చార్జీలు ప్రజలకు భారంగా మారాయన్నారు. బుధవారం రా యవరం నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్రకు మంచి స్పందన లభించింది.

మంగళవారం అర్థరాత్రి రాయవరం చేరుకున్న బాబుకు ఎమ్మెల్యే వేగుళ్ల ఆధ్వర్యంలో పార్టీ నా యకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాయవరంలో బసచేసిన బాబును బుధవారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలు కలుసుకున్నారు. ముందుగా బాబు విద్యుత్ సమస్యపై విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన జిల్లాకు చెందిన కాపు సంఘ నేతలతో భేటీ అయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు సముచిత స్థానం కల్పించి అన్నివిధాలా అదు కోవాలని కోరారు. దీనికి బాబు తాను అధికారంలోకి వచ్చి న వెంటనే న్యాయం చేస్తానన్నారు. అనంతరం బాబు పా దయాత్ర రాయవరం నుంచి సాయంకాలం 4-30 గం.లకు ప్రారంభమైంది.

పాదయాత్రలో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాయవరం సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఎన్‌టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. ప్రజలకోసం తాను పాదయాత్ర ద్వారా ధర్మ పోరాటం చేస్తున్నానని ప్రజలు తనకు సహకరించాలని కాంగ్రెస్ అవినీతిపై ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పాలని బా బు కోరారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రజలకు చాటి చెప్పిన మహనీయుడు ఎన్‌టీఆర్ అని అన్నారు. ఆయన పాదయాత్ర మండలంలో బాబు పర్యటన సుమారు రెండున్నర కిలోమీటర్లు సాగింది. బాబుకు పలువురు వ్యాపారులు, కార్మికులు తమ కష్టాలను వెళ్లబుచ్చుకున్నారు.

వ్యవసాయంపై రైతులు, వస్త్రాలపై వ్యాట్ గురించి వ్యాపారులు బాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు వెంటపల్లి జాన్‌మార్క్ మద్దతు ప్రకటించారు. దారి పొడవునా సాగిన బాబు యా త్రకు ప్రజలు ఘనస్వాగతం పలికి మద్దతు తెలిపారు. రాయవరం మునసబు విగ్రహానికి బాబు పూలమాలువేశారు. పలుచోట్ల చిన్నారులు బాబుకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారి పొడువునా ఉన్న వ్యాపారులు, ప్రజలు, మహిళలు, వృద్థులతో ముచ్చటించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాబు పాదయాత్ర రాయవరం
లో ముగిసి రాత్రికి బిక్కవోలు మండలం కొమరిపాలెం ప్రవేశించింది.

ఆయన వెంట పాద యాత్రలో స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, చినరాజప్ప, మురళీమోహన్, చిక్కాల రామచంద్రరావు, గొల్లపల్లి సూర్యారావు, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, స్థానిక నేతలు ఎరగతపు బాబ్జీ, పసలపూడి శ్రీనివాస్, వల్లూరి నారాయణ మూర్తి, కాశీ, చుండ్రు వెంకట్రావు, టి.కోటారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, కొవ్వూరి రాజగోపాలరెడ్డి, దూళి జయరాజు, బెల్లంకొండ దొరబాబు, నల్లమిల్లి వీర్రెడ్డి, పొలిమాటి ఆనంద బాబు, అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.